Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ కి మరో బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   8 Feb 2016 4:49 AM GMT
రాజ్ తరుణ్ కి మరో బంపర్ ఆఫర్
X
ఇన్నాళ్లూ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ కి.. ఇప్పుడా కిరీటం దూరమైపోయింది. తాజాగా విడుదలైన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతోపాటు.. అటు ప్రేక్షకులను, ఇటు నిర్మాతలను పూర్తిగా నిరాశపర్చింది ఈ సినిమా. దీంతో ఇప్పుడు తన తర్వాతి సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాడు రాజ్ తరుణ్.

ఓ ఫ్లాప్ వచ్చినా ఈ కుర్రాడికి డిమాండ్ మాత్రం బాగానే ఉంది. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు నుంచి రాజ్ తరుణ్ కి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడైన ఈయన.. రాజ్ తరుణ్ నటన నచ్చి, తనే పిలిచి హీరోగా ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. సామాజిక కోణంలో సాగే ఓ స్టోరీకి, ఈ కుర్రాడినే కరెక్ట్ ఛాయిస్ అనుకున్నారట ఆయన. 'ప్రస్తుతం భక్తి సినిమాలే తీస్తున్న రాఘవేంద్రరావు.. తన నెక్ట్స్ వెంచర్ లో రాజ్ తరుణ్ ని తీసుకోవాలని నిర్ణయించారు. సంతానం భవతి అని ఈ మూవీకి టైటిల్ పెట్టే ఛాన్సులున్నాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుందని' రాఘవేంద్రరావు సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ మూవీ చేస్తుండగా.. రాఘవేంద్ర రావు- నాగార్జున కాంబినేషన్ లో రావాల్సిన ఓ భక్తి సినిమా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.