కాంచన 4 కూడా స్టార్ట్ చేస్తాడట..

Thu Apr 25 2019 20:00:01 GMT+0530 (IST)

హారర్ కామెడీ సిరీస్ కాంచన క్రియేటర్ లారెన్స్ తాజాగా విడుదలైన కాంచన 3 ఇచ్చిన ఊపుతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బాలీవుడ్ కి కాంచన సిరీస్ ని పరిచయం చేయబోతున్నాడు. హిందీ కాంచనలో హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నిన్న హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి రెండు వారాలు ఏకధాటిగా ఈ చిత్రాన్ని ముంభైలో షూట్ చేసేందుకు లారెన్స్ ప్లాన్ చేశాడు. అయితే కాంచన 3 కూడా 100 కోట్లు క్లబ్ లో చోటు దక్కించుకునేందుకు రెడీ అవుతుండటంతో - ఈ హిట్ సిరీస్ నుంచి కాంచన 4 ని రెఢీ చేసే ప్లాన్ లో ఉన్నట్లు లారెన్స్ తెలిపారు. ప్రేక్షకులు నుంచి కాంచనకు అనూహ్యమైన స్పందన లభిస్తుందని - కేవలం మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకునే కాంచన సిరీస్ ను రూపొందిస్తున్నానని - ఈ సినిమాలు వారి కోసమే అని లారెన్స్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.అయితే కాంచన సిరీస్ లో ముందు వచ్చిన సినిమాలు కంటే కాంచన 3 పై విమర్శలు చాలా ఎక్కువ వచ్చాయని - రిపీటెడ్ సీన్స్ బోర్ కొడుతున్నాయని కొందరు క్రిటిక్స్ తనతో చెప్పినట్లుగా లారెన్స్ తెలిపారు. వారి సలహాలు కూడా పరిగణలోకి తీసుకొని ఓ కొత్త పాయింట్ తో కాంచన 4ని సిద్ధం చేస్తా అని లారెన్స్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న హిందీ కాంచన ముగిసిన వెంటనే కాంచన 4 పనులు ప్రారంభించేందుకు లారెన్స్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 19న నాని హీరోగా వచ్చిన జెర్సీతో కాంచన 3 విడుదలైంది. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బీ - సీ సెంటర్స్ లో కాంచన 3కే ప్రజలు ఓటేసారు దీంతో జెర్సీ కలెక్షన్స్ లో సింహ భాగం కాంచన జేబులోకి వచ్చి చేరాయి. వచ్చే వారం అవెంజర్స్ తుఫాన్ ని సైతం కాంచన 3 తట్టుకుని నిలబడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.