Begin typing your search above and press return to search.

షారుఖ్ వెర్సస్ సల్మాన్.. నిరాశే

By:  Tupaki Desk   |   5 May 2016 7:30 AM GMT
షారుఖ్ వెర్సస్ సల్మాన్.. నిరాశే
X
బాలీవుడ్ హీరోల్లో ఎవరు కింగ్ అంటే ప్రధానంగా చర్చ నడిచేది ఖాన్ త్రయం మధ్యే దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలుతున్నారు షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్. ఈ ముగ్గురిలో ఎవరి సినిమా వచ్చినా బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఐతే ముగ్గురి మధ్య ప్రొఫెషనల్ గా మంచి పోటీ ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడటానికి ఇష్టపడరు. ఇది ఎవరికీ మంచిది కాదన్న ఉద్దేశంతో వేర్వేరు తేదీల్లో సినిమాలు రిలీజ్ చేసుకోవడానికే ఇష్టపడతారు. ఈ విషయంలో ముగ్గురి మధ్య ఓ అండర్ స్టాండిగ్ ఉంది. ఆ అండర్ స్టాండింగ్ ను పక్కనబెట్టేసి.. ఈ రంజాన్ కు ఒకరితో ఒకరు పోటీ పడాలని అనుకున్నారు షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.

షారుఖ్ కొత్త సినిమా ‘రాయీస్’ను.. సల్మాన్ సినిమా ‘సుల్తాన్’ను ఈ రంజాన్ కు ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ దీని వల్ల రెండు సినిమాలకూ దెబ్బ తప్పదని కలిసి మాట్లాడుకున్నారో ఏంటో కానీ.. మధ్యలో ‘రాయీస్’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే సల్మాన్ సినిమాకు భయపడే ‘రాయీస్’ను షారుఖ్ వాయిదా వేసుకున్నాడన్న ప్రచారం జరగడంతో మళ్లీ ఈ మధ్య రాయిస్ ను రంజాన్ కే విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. నాలుగు రోజుల కిందట ట్విట్టర్లో షారుఖ్-సల్మాన్ అభిమానుల మధ్య వార్ కూడా నడిచింది.

రాయిస్ కు దారివ్వలంటూ షారుఖ్ అభిమానులు.. ‘సుల్తాన్’తో పోటీ పడితే అంతే సంగతులు అని సల్మాన్ అభిమానులు హ్యాష్ ట్యాగ్ లతో పోటీకి దిగారు. ఐతే ఈ వార్ కంటిన్యూ అవుతుండగానే ‘రాయీస్’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షారుఖ్ అభిమానుల ఆశల మీద చల్లాడు దర్శకుడు డోలాకియా. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమాను జనవరి 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడతను. దీంతో షారుఖ్-సల్మాన్ మధ్య బాక్సాఫీస్ వార్ చూద్దామనుకున్న వారికి నిరాశ తప్పలేదు.