Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: న‌గ్నంగా బాత్ ట‌బ్‌ లో

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:19 AM GMT
ఫోటో స్టోరీ: న‌గ్నంగా బాత్ ట‌బ్‌ లో
X
ఆయ‌నేమో అమెరికాలో ఉంటాడు.. నేనేమో ముంబైలో బిజీ! అని మొహ‌మాటం లేకుండానే చెప్పేస్తుంది రాధిక ఆప్టే. వృత్తిప‌రంగా ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీగా ఉండ‌డం వ‌ల్ల స‌రిగా క‌లుసుకోవ‌డం కుద‌ర‌ద‌ని ఓ ఇంట‌ర్వ్యూ లైవ్‌ లో త‌న హ‌బ్బీ గురించి చెప్పింది ఆప్టే. అదంతా స‌రే... రాధిక అంత బిజీగా ఇక్క‌డ ఏం వెల‌గ‌బెడుతోంది? అని ప్ర‌శ్నిస్తే ... ఆ క‌థే వేరు. ఈ అమ్మ‌డు వీలున్న ప్ర‌తిసారీ స్నేహితుల‌తో క‌లిసి విదేశాల‌కు విహారయాత్ర‌ల‌కు వెళుతుంటుంది. అక్క‌డ న‌చ్చిన‌ట్టు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఖాళీ దొరికిన ప్ర‌తిసారీ వెబ్ సిరీస్‌ లు చేస్తూ - అడ‌పాద‌డ‌పా సినిమాల్లోనూ న‌టిస్తోంది.

బికినీ బీచ్ విహారాల్లో ఎంజాయ్ చేయ‌డం ఒకెత్తు అనుకుంటే, ఆన్ ద స్పాట్ నుంచి లైవ్ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌కు చేర‌వేస్తూ అగ్గి రాజేస్తుంది. తాజాగా రాధిక ఆప్టే ఇన్‌ స్టా - ఎఫ్‌ బి - ట్విట్ట‌ర్‌ లో కొన్ని పోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బాత్ ట‌బ్ ఫోటో సంథింగ్ స్పెష‌ల్. ఒంటి పైన నూలుపోగు ఉంటే ఒట్టు. అలానే బాత్ టబ్‌ లోకి న‌గ్నంగా దిగిపోయి జ‌ల‌కమాడుతోంది. ఆ ఫోటో చాలు హీట్ పెంచేందుకు అనుకుంటుండ‌గానే, ఈ అమ్మ‌డు ఓ స్విమ్మింగ్ పూల్ గ‌ట్టుపై కూచుని వేరొక ఫోజు.. ఈ ఫోటోల‌కు ల‌క్ష‌ల్లో లైక్‌ లు - క్లిక్‌ లు ప‌డుతున్నాయి. ఇక‌పోతే బాత్ రూమ్ ప‌క్క‌నే చెట్లు ఉన్నాయి.. దోమ‌లు క‌ర‌వ‌డం లేదా?.. అంటూ అభిమాని చిలిపి ప్ర‌శ్న కూడా వేశాడు.

ఇటీవ‌లి కాలంలో ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూనే - మ‌రోవైపు వెబ్ సిరీస్‌ ల‌లోనూ అల‌రిస్తోంది. ల‌స్ట్ స్టోరీస్‌ లో రాధిక బోల్డ్ ఎటెంప్ట్‌ కి యూత్ ఫిదా అయిపోయారు. ప్ర‌స్తుతం మోస్ట్ పాపుల‌ర్‌ శాక్ర్‌ డ్ గేమ్స్ వెబ్ సిరీస్‌ లోనూ న‌టిస్తోంది. వీటితోనే రాధిక‌కు బోలెడంత పేరొస్తోంది. అంత‌కుమించి పారితోషికాలు అందుకుంటోంది. మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం వేరుగా ఉంది. ఓవైపు బాలీవుడ్ సినిమాలు చేస్తూనే - హాలీవుడ్‌ లో వీలున్న‌ప్పుడ‌ల్లా న‌టిస్తోంది. అన్నిటికీ మించి మీటూ ఉద్య‌మంలో త‌న‌పై జ‌రిగిన ఆకృత్యాల గురించి డేరింగ్‌ గా మాట్లాడిన రేసింగ్ గాళ్‌ గా పాపుల‌రైంది.