Begin typing your search above and press return to search.

రాధికా న్యూడ్ సినిమా.. సూపరెహ!!

By:  Tupaki Desk   |   24 Sep 2016 11:30 AM GMT
రాధికా న్యూడ్ సినిమా.. సూపరెహ!!
X
పార్షెడ్.. ఓ నెల్లాళ్ల క్రితం పార్షెడ్ అనే హిందీ మూవీకి సంబంధించిన క్లిప్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యి సెన్సేషన్ అయిపోయాయి. ట్యాలెంటెడ్ బ్యూటీ రాధికా ఆప్టే నటించిన సెమీ న్యూడ్.. న్యూడ్.. ఇంటిమేట్ సన్నివేశాలతో ఉన్న ఆ వీడియో క్లిప్ కారణంగా.. ఈ మూవీపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. అప్పట్లో అసలు ఇక్కడ రిలీజ్ చేసేందుకు ఈ సినిమాను తెరకెక్కించలేదన్న మూవీ యూనిట్.. ఇప్పుడు వచ్చిన క్రేజ్ ను బేస్ చేసుకుని విడుదల చేసిసినట్లుగా కనిపిస్తోంది. అయితే.. పార్షెడ్ మూవీ చూసినోళ్లు మాత్రం ఒకటికి వంద సార్లు పొగిడేస్తున్నారంటే.. ఈ సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్ధమవుతుంది.

పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కునే కష్టాలపై తీసిన ఈ సినిమాలో.. మేల్ కేరక్టర్స్ ను కావాలనే బాగా క్రూడ్ గా మలిచారనే ఒక్క ఫీలింగ్ తప్ప.. మిగిలిన అన్ని యాంగిల్స్ లోనూ పార్షెడ్ కు వంక పెట్టడానికి ఆస్కారం ఉండదు. మహిళలను కేవలం పిల్లలను కనడానికి.. మగవారి అవసరాలను తీర్చడానికి మాత్రమే అనుకునే సమాజంలో.. నలుగురు యువతులు ఎదుర్కున్న పరిస్థితులే ఈ సినిమా. 'నా భార్య నాకు నచ్చకపోయినా.. మొగుడిగా ఆమె అవసరాలు తీరుస్తున్నా' అని ఓ భర్త తన స్నేహితులతో డైలాగ్ చెబుతాడంటే.. ఎంత డెప్త్ గా ఈ మూవీలో సన్నివేశాలు డైలాగ్స్ ఉంటాయో అర్ధమవుతుంది.

తనిష్టా ఛటర్జీ.. రాధికా ఆప్టే. సుర్వీన్ చావ్లా.. లెహర్ ఖాన్ లు.. తమ పాత్రల్లో జీవించేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన పాత్ర. ఇంటిమేట్ సీన్స్ లో రాధికా ఆప్టే చూపించిన కమిట్మెంట్ ని చెప్పడానికి మాటలు చాలవు. కానీ ఆ సన్నివేశాల ప్లేస్ మెంట్ కారణంగా.. అందులో బూతును చూసే సాహసం ఎవరూ చేయలేరు. అంత అర్ధవంతంగా పార్షెడ్ ని మలిచిన లీనా యాదవ్ కు ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే.