Begin typing your search above and press return to search.

ఎగ్గొట్టేసి దురదృష్టం అంటున్న వైఫ్

By:  Tupaki Desk   |   29 July 2016 6:07 AM GMT
ఎగ్గొట్టేసి దురదృష్టం అంటున్న వైఫ్
X
వీకెండ్స్ లో కలెక్షన్స్ కుమ్మేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి.. ఆ తర్వాత బాగా స్లో అయింది. అయితే నిర్మాత కలైపులి థాను మాత్రం తమ సినిమా ఇప్పటికే 300కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేసిందని చెబుతున్నాడు. ఇది నిజం కాదని అర్ధమవుతూనే ఉన్నా.. పబ్లిసిటీ కోసం ఇలాంటి హంగామా చేస్తున్నాడు. అసలు రిలీజ్ ముందు నుంచి ఇలాంటి పబ్లిసిటీతోనే విపరీతమైన హైప్ తీసుకొచ్చి ఓపెనింగ్స్ తెచ్చాడు థాను.

అయితే కబాలి విషయంలో వేరే ఎవరూ సరైన పబ్లిసిటీ చేయలేదనే సంగతి తెలిసిందే. స్వయంగా రజినీకాంత్ కూడా కబాలి రిలీజ్ సమయానికి అమెరికాలో ఉన్నారు. ఓ స్పెషల్ ప్రివ్యూ చూశారన్న మాట తప్పిస్తే.. కనీసం మూవీ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. కబాలి భార్యగా నటించిన రాధికా ఆప్టే పరిస్థితి కూడా అంతే. ప్రచారాలకు డుమ్మా కొట్టేసింది. తీరా ఇప్పుడు మాత్రం కబాలి ప్రమోషన్స్ కు మిస్ అయినందుకు బాధగా ఉందని.. అది చాలా దురదృష్టమని అంటోంది కబాలి వైఫ్.

ఆ సమయంలో బాలీవుడ్ మూవీ ఘౌల్ షూటింగ్ లో ఉండడంతోనే కబాలి ప్రమోషన్స్ కు అటెండ్ కాలేకపోయానని రీజన్ కూడా చెప్పింది. అంతా అయిపోయాక రిజల్ట్ తేడా వచ్చాక రీజన్స్ ఎందుకులే రాధికా!