Begin typing your search above and press return to search.

ఒక్క టాప్ తో టాప్ లేపేస్తోంది!!

By:  Tupaki Desk   |   3 May 2016 4:59 AM GMT
ఒక్క టాప్ తో టాప్ లేపేస్తోంది!!
X
బాలీవుడ్ లో హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ హీరోయిన్లలో బోల్డ్ హీరోయిన్లు వేరయా అన్నది వాస్తవం. ఇలాంటి బోల్డ్ భామలు చాలామందే ఉన్నా.. వీరందరిలోకి రజినీకాంత్ కబాలి హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం బోలెడంత డేరింగ్ కూడా. కేరక్టర్స్ ఎంపిక నుంచి వాటి పిక్చరైజేషన్ వరకూ.. అమ్మడి చాలా ధైర్యం చేసేస్తుంది. ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే రాధికా ఆప్టే బిహేవియర్.. ఛాన్సులతో పాటు పేరు ప్రఖ్యాతులను కూడా తీసుకొస్తోంది.

ఇక మేగజైన్ ఫోటో షూట్స్ కోసం అయితే.. రాధిక చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. ఎఫ్ హెచ్ఎం రీసెంట్ ఎడిషన్ కోసం రాధికా ఆప్టే హాట్ హాట్ ఫోటో సెషన్ చేసింది. కవర్ పేజ్ పై ఉన్న ఒక్క ఫోటో చాలు.. ఎంత బోల్డ్ గా పోజులిచ్చిందో అర్ధం కావడానికి. ఒంటిపై కేవలం వైట్ టాప్, అది కూడా గుండీలు తీసేసి క్లీవేజ్ చూపిస్తూ ఇచ్చిన పోజ్ అద్దిరిపోయింది. ఇక తొడలను పూర్తిగా ప్రదర్శనకు పెట్టేసింది.

ఇదంతా శాంపిల్ అంటూ మేగజైన్ కవర్ పై ఇచ్చిన కొటేషన్ మరింతగా ఊరిస్తోంది. 'హెచ్చరిక..లోపల హాట్ స్టఫ్ చాలానే ఉంది. వేళ్లు కాలే ప్రమాదం ఉంది' అని రాసిన వాక్యాలు మరింతగా ఆసక్తి కలిగిస్తున్నాయి. నిజంగానే రాధిక మంట పుట్టించిందని అంటున్నారు అభిమానులు.