Begin typing your search above and press return to search.

రాధిక అందాల వెయిటింగ్

By:  Tupaki Desk   |   28 May 2016 6:46 AM GMT
రాధిక అందాల వెయిటింగ్
X
రాధికా ఆప్టే.. పెర్ఫామెన్స్ విషయంలోనే కాదు.. ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. అమ్మడి లోని అట్రాక్షన్ కి బాలీవుడ్ లో అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇన్నేళ్లూ యాక్టింగ్ తో ఇరగదీసిన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ డోస్ లోనూ రెచ్చిపోతోంది. రీసెంట్ గా నసీరుద్దీన్ షా - కల్కి కొచ్లిన్ - రజత్ కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన వెయిటింగ్ మూవీ స్క్రీనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనేకమంది సెలబ్రిటీలు - అందాల భామలు హాజరయ్యారు. అందరిలోకి రాధికా ఆప్టేనే స్పెషల్ అట్రాక్షన్ అయిందంటే.. ఈ భామ జోరు అర్ధమవుతుంది.

ప్రోగ్రామ్ ఏదైనా.. ఫోకస్ అంతా తమపై ఉండేలా చూసుకోవడంలో రాధికా ఆప్టే బాగా సక్సెస్ అవుతోంది. అన్నిటికీ మించి అమ్మడిలో ఉన్న ట్యాలెంట్.. ఈ అట్రాక్షన్ కు మరింతగా పదును పెంచుతోంది. అసలు ఓ మూవీ స్క్రీనింగ్ కి ఈ భామ ఇంతగా అందాలు ఆరబోస్తూ హాజరు కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ప్రతీ విషయంలోనూ బాలీవుడ్ తో పోటీ పడే మన హీరోయిన్లు.. ఇలాంటి విషయాల్లో మాత్రం బాగా వెనకబడిపోతున్నారు. తమను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తేనో - లేదా ఏదైనా భారీ ఈవెంట్ అయితే మాత్రమే.. డ్రస్సుల్లో కాసింత పొదుపు పాటిస్తున్నారు. కానీ రాధికా ఆప్టే మాత్రం.. జస్ట్ తనపై ఫోకస్ ఉండేందుకు.. ఫ్రీగా అందాల ప్రదర్శన చేసేస్తోంది. ఏమైనా రాధిక తెలివే తెలివి.