Begin typing your search above and press return to search.

పిచ్చెక్కించేస్తున్న‌ రాధికా ఆప్టే కొత్త పోస్ట‌ర్

By:  Tupaki Desk   |   23 May 2016 3:03 PM GMT
పిచ్చెక్కించేస్తున్న‌ రాధికా ఆప్టే కొత్త పోస్ట‌ర్
X
రాధికా ఆప్టే కొత్త సినిమా ‘ఫోబియా’కు సంబంధించిన పోస్ట‌ర్ క‌నిపించినా.. టీజ‌ర్ ట్రైల‌ర్ చూసినా జ‌నాల‌కు అదో ర‌క‌మైన ఫోబియా వ‌చ్చేస్తోంది. క్రియేటివిటీ కేరాఫ్ అడ్ర‌స్ లాగా నిలుస్తున్న ఈ సినిమా ప్రోమోలు బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫ‌స్ట్ పోస్ట‌ర్ రిలీజైన నాటి నుంచి ఆస‌క్తి రేకెత్తిస్తున్న ఫోబియా టీం.. తాజాగా ఓ విభిన్న‌మైన పోస్ట‌ర్ తో ప‌ల‌క‌రించింది. రిలీజ్ డేట్ క‌న్ఫ‌మ్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ జ‌నాల‌కు పిచ్చెక్కించేస్తోంది. దీని గురించి మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం. చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం త‌ప్ప‌.

రాధిక ఇచ్చిన ర‌క‌రకాల హావ‌భావాల్ని క‌లిపి క్ల‌మ్సీగా ఈ పోస్ట‌ర్ త‌యారు చేసింది ఫోబియా టీమ్. సినిమా ఎంత టిపిక‌ల్ గా ఉండ‌బోతోందో ఈ పోస్ట‌ర్ని బ‌ట్టి చెప్పేయొచ్చు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. త‌న‌నెవ‌రో చంపేస్తారేమో అని నిరంత‌రం భ‌య‌ప‌డుతూ ఇంటికే ప‌రిమిత‌మైపోయిన ఓ అమ్మాయి క‌థ ఇది. ట్రైల‌ర్ చూస్తే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌క్కువ కాన‌ట్లు క‌నిపించింది. ప‌వ‌న్ కృప‌లాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మించింది. ఈ శుక్ర‌వార‌మే ఫోబియా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమానే అయిన‌ప్ప‌టికీ రాధిక‌కు ఉన్న ఫాలోయింగ్.. సినిమా మీద నెల‌కొన్న ఆస‌క్తి దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు.