Begin typing your search above and press return to search.

రాధికకు తగ్గ పాత్రేనట

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:30 AM GMT
రాధికకు తగ్గ పాత్రేనట
X
నటీమణులలో అందాల ప్రదర్శన చేసేవాళ్ళున్నారు.. మంచి అభినయం కనబరిచే వాళ్ళూ వున్నారు. రెండూ కలగలిసిన వారు మాత్రం చాలా తక్కువ. సరిగ్గా ఈ కేటగిరీకే చెందుతుంది రాధిక ఆప్టే. అందాల ఆరబోతకు అడ్డు చెప్పదు. నటనలోనూ మార్కులు తగ్గించుకోదు. అందుకే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అవకాశాలు మాత్రం విరివిగానే వస్తున్నాయి.

ఈ సుందరి అట్టకత్తి, మద్రాస్ సినిమాల దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీతో ఓ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అది కన్ఫర్మ్ అని తేలింది. రజనీకి హీరోయిన్ లేదన్నది నిజమే. గ్యాంగ్ స్టర్స్ పక్కనే అందాల తుపాకీలు ఉంటాయ్ కదా అదేనండి జేమ్స్ బాండ్ సినిమాలో ఓ వైపు అందాలతో మరోవైపు బుల్లెట్లతో ప్రాణం తీస్తుంటారే అలా అన్నమాట. ఇది రాధికకు తగ్గ పాత్రే కదూ..!