Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: రాధ!! శ్లోకమా? సారంశమా?

By:  Tupaki Desk   |   1 March 2017 12:41 PM GMT
టీజర్ టాక్: రాధ!! శ్లోకమా? సారంశమా?
X
హ్యాపెనిం్ హీరో శర్వానంద్ లీడ్లో కొత్త దర్శకుడు చంద్రమౌళి రూపొందించిన సినిమా ''రాధ''. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు.

ఇప్పటివరకు మనం చూసిన పోలీస్ సినిమాల టైపులో ఇది కూడా ఒక స్టయిలిష్‌ కాప్ ఎంటర్టయినర్ అనే చెప్పాలి. ముఖ్యంగా శర్వానంద్ తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేశాడు. అందులో కొత్త దర్శకుడు చంద్రమౌళి మేకింగ్ పరంగా మనోడిని చాలా డైనమిక్ గా చూపించాడు. ఆ కాలంలో కృష్ణుడు.. ఈ కాలంలో పోలీసోడు దుష్టసంహారణార్దం అవతరిస్తాడని సెలవిచ్చాడు. ఇక టీజర్ చివర్లో.. ''నీకు శ్లోకం కావాలా? సారాంశం కావాలా?'' అంటూ మనోడు తనదైన స్లాంగులో అడిగే తీరు అదరగొట్టేసింది. ఇక టీజర్లో సరదాగా అలా తళుక్కుమన్న లావణ్య.. గ్లామర్ తో అదరగొట్టేసింది.

చూస్తుంటే శర్వానంద్ మరోసారి హిట్టు కొట్టేశాలే కనిపిస్తున్నాడే!!