రేస్ 3.. మాములుగా లేదుగా

Tue May 15 2018 22:21:27 GMT+0530 (IST)

బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు వస్తున్నాయి అంటే చాలు బాక్స్ ఆఫీస్ రెడీగా ఉండాల్సిందే. ధూమ్ - రేస్ వంటి యాక్షన్ చిత్రాలను బాలీవుడ్ అభిమానులతో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా చాలావరకు ఇష్టపడతారు. ఇక వాటికి కొనసాగిపుగా కథలు వస్తూనే ఉన్నాయి. ఈ సారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సల్మాన్ ఖాన్ రేస్ 3 తో రాబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది.చూస్తుంటే ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యేలా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా దర్శకుడు రేమో డి సౌజా తెరకెక్కించిన విధానం ఊహలకు తెలుస్తోంది. ట్రైలర్ లోనే సీన్స్ ఆడిరిపోయాయి అంటే ఇక ఫుల్ సినిమాలో యాక్షన్ పార్ట్ దిమ్మ తిరిగేలా చేస్తుంది అని చెప్పవచ్చు. స్టయిలిష్ గా కనిపించే బాబీ డియోల్ - జక్వాలిన్.. డైసీ షా ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలు చేసినట్లు తెలుస్తోంది. ఇక విలన్ గా అనిల్ కపూర్ పాత్ర ఏ స్థాయిలో ఉందో ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మాస్ లుక్ తో పాటు స్టయిలిష్ లుక్ విజిల్స్ వేసే విధంగా ఉన్నాయి. ఇక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని డైలాగ్స్ వింటూంటే అర్ధమవుతోంది. మూడు నిమిషాల 9 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ బోర్ కొట్టకుండా ఉంది. గత రెండు సిరీస్ ల కంటే చాలా కొత్తగా ఉందనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఈద్ కానుకగా జూన్ 15 రిలీజ్ కానుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి