రేసులో అప్పుడే దూసుకెళ్లిపోయింది

Tue Jun 12 2018 10:02:48 GMT+0530 (IST)


బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి యాక్షన్ తో దుమ్ము దులిపేయడానికి రెడీ అయిపోయాడు. భారీ ఛేజింగులు.. దిమ్మ తిరిగిపోయే ట్విస్టులు.. కళ్లు చెదిరే అందాలతో ప్రేక్షకులను ఇంప్రెస్  చేసేందుకు రేస్-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇందులో యాక్షన్ సన్నివేశాలన్నీ హాలీవుడ్ ను తలదన్నేలా ఉంటాయనే విషయం ట్రయిలర్ లోనే క్లారిటీగా చెప్పేశారు.అసలే సల్మాన్ కు ఉన్న మాస్ ఇమేజ్ కు తోడు సినిమా ఓ రేంజిలో తీయడంతో రేస్-3 పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకుల్లో సల్మాన్ కు ఉన్న ఆదరణ దృష్ట్యా అతి భారీ మొత్తం ఇవ్వడానికి ఓటీవీ నెట్ వర్క్ రెడీ అయింది. ఇంతవరకు బాలీవుడ్ శాటిలైట్ కు అత్యధిక రేటు అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ మూవీకి పలికింది. ఇప్పుడు ఆ మొత్తం కన్నా ఎక్కువే రేస్-3కి దక్కుతోందని తెలుస్తోంది. దీనిపై ఇంకా నిర్మాతలతో డీల్ ఓకే చేయాల్సి ఉంది.

రేస్-3 సినిమాలో సల్మాన్ కు హీరోయిన్ గా శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. బాబీడియోల్ - అనిల్ కపూర్ - డైసీ షా - సాఖిబ్ సలీం ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ - రమేష్ తౌరానీ సంయుక్తం ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ డైరెక్టర్ రెమో డిసౌజా. జూన్ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.