Begin typing your search above and press return to search.

ట్యాలెంట్ చూపిస్తున్న అందాల రాశి

By:  Tupaki Desk   |   19 Jun 2018 4:34 PM GMT
ట్యాలెంట్ చూపిస్తున్న అందాల రాశి
X
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నాకు ఇప్పుడు తను కోరుకున్న బ్రేక్ వచ్చేసింది. ఊహలు గుసగుసలాడే అంటూ కుర్రకారును గిలిగింతలు పెట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత గ్లామర్ రూట్లోకి మారి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. టాలీవుడ్ లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామలకు ఉన్న డిమాండ్.. అందే రెమ్యూనరేషన్ వంటివి.. బహుశా ఆమెను అటువైపు నడిపించి ఉంటాయి.

ఒకటి రెండు సినిమాల్లో గ్లామర్ వేషాలు వేసిన తర్వాత.. లావుగా ఉందనే మాటలు వినిపించడంతో.. చాలా కష్టపడి మరీ వర్కవుట్స్ చేసి ఫిట్నెస్ సంపాదించేసింది. అయినా సరే.. రాశి ఖన్నాకు ఆశించిన స్థాయి అయితే రాలేదు. మధ్యలో సుప్రీమ్ మూవీతో ఓ మంచి హిట్ ను అయితే సొంతం చేసుకుంది కానీ.. ఇందులో పోషించిన బెల్లం శ్రీదేవి పాత్రకు పేరు అయితే వచ్చింది కానీ.. ఆమె కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. కానీ తొలిప్రేమ మూవీలో వరుణ్ తేజ్ కు జోడీగా పెర్ఫామెన్స్ బేస్డ్ పాత్రను పోషించిన రాశి ఖన్నాకు.. అటు బ్రేక్ రావడమే కాదు.. మంచి పేరు కూడా వచ్చింది.

మళ్లీ తన తొలి చిత్రం నాటి మెరుపులను చూపించిన వైనం మెప్పించింది. ఇప్పుడు రాబోతోన్న శ్రీనివాస కళ్యాణం చిత్రంలో కూడా గ్లామర్ చూపించాల్సిన అవసరం లేని క్యారెక్టర్ నే పోషించబోతోందట. ఇందుకు సంబంధించిన టీజర్ మాదిరిగా.. కొన్ని ఫోటోలను నెట్ లో కూడా పోస్ట్ చేస్తోంది. కాకపోతే ఆన్ స్క్రీన్ పై అందాల ఆరబోత తగ్గించాలని డిసైడ్ అయినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం.. ఈ అమ్మడు చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. మొత్తానికి ఎక్కడ అందాలు చూపించాలో.. ఎక్కడ ప్రతిభను ప్రదర్శించాలో అనే విషయంపై రాశి ఖన్నాకు పక్కా క్లారిటీ వచ్చేసినట్లుగా ఉంది.