అందాల రాశి.. ఆరబోతతో అలరించేసింది

Thu Jan 12 2017 15:48:20 GMT+0530 (IST)

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా.. ఈ తరం యంగ్ బ్యూటీస్ లో మాంచి జోరు మీదుంది. వరుస సినిమాలు.. చేసినవాటిలో ఎక్కువ హిట్స్.. ఇలాంటి ట్రాక్ రికార్డు అందరికీ సాధ్యం కాదు. చివరగా రామ్ తో చేసిన హైపర్ నిరుత్సాహపరిచినా.. తన అందాల ప్రదర్శనతో మాత్రం ఆడియన్స్ ను బాగా సంతృప్తి పరిచింది.

బికినీ షోకులతో సహా.. ఎగ్జిబిట్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోని ఈ అందాల ముద్దుగుమ్మ.. ఇప్పుడు లంగాఓణీలో మెరుపులు మెరిపించేసింది. ఈ డిజైనర్ వేర్ లో అమ్మడిని చూస్తే.. రాశికి ఎక్కడ కొలతలు అక్కడ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో తెలుస్తుంది. క్రేజీ హీరోయిన్ అంటే.. సోయగాలు సహజమే కానీ.. వాటిని ప్రదర్శించడంలో నేర్పు అందరికీ అబ్బే విద్య కాదు. ఈ విషయంలో రాశి ఖన్నా.. నాలుగడుగులు ముందే ఉంటా అని.. ఇన్ డైరక్టుగా చెప్పేస్తోంది. హాఫ్ శారీలో ఇంతగా మెరిసిపోవచ్చనే విషయం.. చాలామందికి నేర్పుతోంది రాశి ఖన్నా. స్లీవ్ లెస్ నుంచి.. ఆ డ్రెస్ కి ఉన్న అన్నేసి కట్స్ చూస్తుంటే.. కలర్ ఫుల్ గా మిలమిలలాడిందీ బ్యూటీ.

తమిళ్ లోనూ అరంగేట్రం చేస్తున్న రాశిఖన్నా.. ఒకేసారి రెండు సినిమాలు చేయడంతో పాటు.. త్వరలో ఆక్సిజన్ అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను గోపీచంద్ తో కలిసి పలకరించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/