Begin typing your search above and press return to search.

దర్శకుడితో ఎఫైర్ గురించి రాశి ఖన్నా

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:50 AM GMT
దర్శకుడితో ఎఫైర్ గురించి రాశి ఖన్నా
X
తనలో ఎన్నడు చూడని కొత్త బ్యూటీని, టాలెంట్ ని తొలిప్రేమ సినిమాలో చూపించిన రాశి ఖన్నా ఫుల్ హ్యాపీగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఒక పెద్ద హిట్ అందుకున్న ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తోంది. సరిగ్గా దానికి వారం ముందు వచ్చిన టచ్ చేసి చూడు ఫలితం కొంత టెన్షన్ పెట్టినా తక్కువ టైంలోనే తొలిప్రేమ దానిని కవర్ చేయటంతో ఇప్పుడు రిలాక్స్ గా ఉంది. ఈ నేపధ్యంలో తన మీద గతంలో వచ్చిన పుకారు గురించి స్పందించింది రాశి ఖన్నా. తనకు దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య ఏదో ఉన్నట్టు కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిందని, అసలు ఇలాంటివి ఎలా పుట్టిస్తారో అర్థం కాలేదంటున్న రాశి దీన్ని పూర్తిగా కొట్టి పారేసింది.

సుప్రీమ్ ద్వారా తనకో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడన్న అభిమానంతో అనిల్ కోసం, తనకు మంచి స్నేహితుడైన రవితేజ కోసం రాజా ది గ్రేట్ జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయాను తప్ప అంతకు మించి ఇంకేమి లేదని కుండ బద్దలు కొట్టేసింది. ఒక తల్లికి బిడ్డగా తనకు తప్పు ఒప్పులు తెలిసినప్పుడు వాటికి తగ్గట్టే మలుచుకుంటాను అన్న రాశి అఫైర్ ఎవరి మధ్య అయినా నిజంగా ఉంటే రాయాలి తప్ప వీడియోల వ్యూస్ కోసం ఇలా చేయటం భావ్యం కాదని చెప్పింది. మొత్తానికి ఈ ఇష్యూ మీద మొదటి సారి మాట్లాడిన రాశి ఖాన్న దీంతో చెక్ పెట్టేసినట్టే.

సినిమా పరిశ్రమలో హీరో హీరొయిన్ మీద గాసిప్స్ వస్తూ ఉంటాయి కాని హీరొయిన్ దర్శకుడు మీద రావడం మాత్రం చాలా అరుదు. అలా వచ్చి నిజంగా భార్య భర్తలు అయిన జంటల్లో మనకు గుర్తొచ్చేది రమ్య కృష్ణ-కృష్ణ వంశీ. ఆ మధ్య అమలా పాల్-దర్శకుడు విజయ్ కూడా ఒక్కటయ్యారు కాని తక్కువ టైంలోనే విడిపోయే దాకా తెచ్చుకున్నారు. t తన విషయంలో వచ్చిన వాటిని రాశి ఖన్నా కొట్టి పారేయడంతో ఇక వీటికి తెరపడింది.