వయ్యారి భామకు విల్లా కావాలట

Wed Sep 13 2017 18:24:47 GMT+0530 (IST)

రాశిఖన్నా మొదట అడుగుపెట్టింది బాలీవుడ్ లోనే అయినా అమ్మడు ఆ తర్వాత ప్రతి అడుగు టాలీవుడ్ లోనే వేస్తోంది. ఇప్పటివరకు కుర్ర హీరోలతో ఆడిపాడిన భామ మొదటి సారి స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమాలో చాన్సు దక్కించుకొని అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. అయితే అమ్మడు 2014 నుంచి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి మినిమమ్ మూడు సినిమాల్లో మెరుస్తున్నా ఒక ఇంటిని కూడా కొనుక్కోలేదు.ఇన్ని రోజులు చిన్న హీరోలతోనే ఎక్కువగా నటించింది. ఆ సినిమాలు కూడా రాశి కి అంతగా బ్రేక్ ని ఇవ్వలేదు. ఓ మీడియం హీరోలతో నటించే ఛాన్స్  వచ్చినా ఎక్కువగా ఇద్దరి హీరోయిన్స్ తో  ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక రెమ్యునరేషన్ కూడా కొద్దీ కొద్దిగానే వచ్చేది. సినిమాలు రిజల్ట్ ఎలా ఉన్న అమ్మడి గ్లామర్ తో ఇప్పటివరకు బాగానే నెట్టుకొచ్చింది. అలాగే ఆమె అందానికి ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు. దీంతో అమ్మడు కొన్నిషాప్ ఓపెనింగ్స్ కి మరియు ఈవెంట్స్ కి వెళ్లి కొంత డబ్బును వెనకేసుకుంది.

ఆ వచ్చిన డబ్బుతో రాశి త్వరలోనే ఒక మంచి విల్లాను కొనుక్కొని అందులోకి షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తుందట. శంషాబాద్-గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది స్టార్స్ విల్లాలను కొనుకున్నారట.. ఇక రాశి కూడా అదే తరహాలో కొనుక్కొని టాలీవుడ్ లోనే స్థిరపడిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.