Begin typing your search above and press return to search.

మాస్ మహారాజా తో పెదాల ముద్దులు

By:  Tupaki Desk   |   17 Jan 2018 6:37 AM GMT
మాస్ మహారాజా తో పెదాల ముద్దులు
X
సినిమా అన్నాక హీరో హీరోయిన్లు చాలా కష్టపడి నటించాల్సి ఉంటుంది. అది కథ కోసమే కావచ్చు డైరెక్టర్ కోసం అవ్వచ్చు హీరోయిన్లు బికినీలు వేసుకుని కెమెరా ముందుకు రావాల్సి ఉంటుంది లేదా హీరోతో లిప్ లాక్ పెట్టాల్సి రావచ్చు. కొన్నిసార్లు రెండూ చేయాల్సి రావచ్చు. మనం చూస్తే హీరోయిన్ ఒక సినిమాలో హీరోతో చేసిన పనే మళ్ళీ వేరే సినిమా లో కూడా అదే హీరో తో చేయవచ్చు.

ఉదాహరణకు 'ఎం మాయ చేసావే' లో ఆన్ స్క్రీన్ పై ముద్దుపెట్టుకున్న సమంత నాగ చైతన్య చాలా వరకు కలిసి నటించిన సినిమాల్లో ముద్దు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా లో ఒక హీరో ఉండగా చేసినవే వాళ్ళు మళ్ళీ అదే హీరో తో వేరే సినిమా లో చేయడం మనం గమనించవచ్చు. అలానే 'సుప్రీమ్' చిన్నది రాశి ఖన్నా మాస్ మహారాజా రవి తేజ తో 'బెంగాల్ టైగర్' సినిమా లో నటించింది. అందులో ఈమె బికినీ వేసుకుని ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. ఇపుడు మళ్ళీ రవి తేజ తో 'టచ్ చేసి చూడు' లో నటిస్తున్న విషయం తెల్సిందే. కాగా, ఇందులో కూడా రాశి బికినీ లో కనపడబోతోంది అని టాక్. ఇక్కడితో ఆగట్లేదండోయ్. మాస్ మహరాజ్ కు పెదాల ముద్దు.. అదేనండీ లిప్ లాక్ కూడా పెట్టేస్తోంది.

ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్ళు అయినప్పటికీ ఈమెకి ఒక బ్లాక్ బస్టర్ కూడా లేదు. అందుకనే స్టార్ స్టేటస్ ను పొందటం కోసం ఆమె గ్లామరసం చిందిస్తూ.. ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవలని చూస్తున్నట్టు లేదు? చూద్దాం మరి రాశి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.