ఫోటో స్టోరి: ఇలలో ఇంతందమా?

Mon Feb 18 2019 19:17:37 GMT+0530 (IST)

ఆ అందాన్ని చూస్తే అందానికే కుళ్లు పుట్టాలి. ఇలలో ఇంతందమా?  కలలోనైనా చూడలేదే అంటూ పరేషాన్ అవ్వాలి. అదిరే అందాల రాశివే అంటూ మోహంలో పడాలి. అంతగా సమ్మోహనంతో మాయ చేస్తున్న ఈ కన్నె బ్యూటీ ఎవరో ప్రత్యేకించి చెప్పాలా?  కజురహో శిల్పమో.. కనకాంబరానికి సిస్టరో కానీ... కవుల్లోని కపిత్వాన్ని బయటికి లాగే ముద్దందం రాశీకే చెల్లింది. అందం మొత్తాన్ని ఒకచోట రాశిగా పోస్తే.. ఈ దివ్య రూపం పుట్టిందనడంలో సందేహం లేదు.అందుకే టాలీవుడ్ లో ప్రవేశించిన ఈ బ్యూటీ ఐదారేళ్లుగా ఎదురేలేని కెరీర్ ని సాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద హిట్టు ఫట్టుతో పనే లేకుండా ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఎలాంటి డోఖా లేకుండా చూసుకుంటోంది. ఇటీవలే శ్రీనివాస కళ్యాణం ఫ్లాపైనా - తొలి ప్రేమ లాంటి విజయం అందుకున్న రాశీ ప్రస్తుతం తమిళంలో కుర్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. గత ఏడాది అదర్వ సరసన ఇమైక్క నోడిగల్ అనే చిత్రంలో నటించింది. జయం రవి సరసన అడంగ మారు అనే థ్రిల్లర్ లో మెరిసింది. ప్రస్తుతం విశాల్ సరసన అయోగ్య చిత్రంతో పాటుగా  సైతాన్ కా బచ్చా అనే హారర్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.

వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ బొద్దుగుమ్మ అక్కడ కుర్రకారుకు కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. అందుకే ప్రఖ్యాత చెన్నయ్ టైమ్స్ టాప్ 30 మోస్ట్ డిజైరబుల్ బ్యూటీస్ లో రాశీకి చోటిచ్చింది. ఇంతటి ఘనత అందుకున్న సందర్భ ంగా రాశీ వరుసగా సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. అందులో ఓ చక్కని ఫోటో ఇది.