Begin typing your search above and press return to search.

అందాల బొమ్మ.. మరింత అందంగా

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:42 AM GMT
అందాల బొమ్మ.. మరింత అందంగా
X
అందాల బొమ్మను చూసినప్పుడు అశువుగా కవిత్వమైనా వచ్చేయాలి.. లేదా మురిపించే ఊహలేమో మదిలో గుసగులాడాలి. అందుకే ఊహలు గుసగుసలాడేతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నాకు టాలీవుడ్ లో తొందరగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. అందమైన చిరునవ్వు.. ముద్దొచ్చే మొహం.. చక్కటి గ్లామర్ ఇవన్నీ రాశీ స్పెషల్ అసెట్స్.

రాశీఖన్నాకు ఇప్పటివరకు వచ్చిన పాత్రలో హోమ్లీగా ఉండే క్యారెక్టర్లే వచ్చాయి. జైలవకుశలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా నటించినా ఆ సినిమాలో ఆమె గ్లామర్ పెద్దగా ఆరబోయాల్సిన అవసరం రాలేదు. అందుకేనేమో ఈ సుందరి తన అందంలో ఎంతటి నిషా ఉందో తెలియజేయడానికి అన్నట్టు ఓ ఫొటో తీసి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. స్లీవ్ లెస్ వేర్ లో తన మెడ ఒంపులు చూపిస్తూ ఓరచూపులతో ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫొటో చూసిన రాశీ అభిమానులంతా ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.

అందగత్తెలెంతో మంది ఉన్నా ఆ అందాన్ని అంతకన్నా అందగా ప్రదర్శించడం అందరికీ అబ్బే విద్య కాదు. ఈ విషయంలో రాశి ఖన్నా మిగతావారికంటే చాలా స్పెషల్. మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన తొలిప్రేమ సినిమాతో రాశీ త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వస్తున్న ఈ మూవీతో కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.