Begin typing your search above and press return to search.

రాశి అందాల దెబ్బకు భారీగానే ఉంటాయ్

By:  Tupaki Desk   |   30 Sep 2016 4:35 AM GMT
రాశి అందాల దెబ్బకు భారీగానే ఉంటాయ్
X
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటించిన హైపర్ మూవీ సందడి.. థియేటర్లలో ఇప్పటికే మొదలైపోయింది. విడుదలకు వారం ముందు నుంచి సూపర్బ్ ప్లానింగ్ తో ప్రమోషన్ చేసి మంచి హైప్ తీసుకొచ్చారు. అందుకు తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే కనిపించాయి. కమర్షియల్ మూవీ అని ప్రొజెక్ట్ చేస్తూ.. ఈ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం రామ్ కి ఉన్న క్రేజ్ కి అద్దం పడుతోంది.

ఇకపోతే సరిగ్గా రిలీజ్ కి ఒక రోజు ముందు రాశి అందాలను విందుగా చేసి పోస్టర్ల పరిచేశారు. '1 డే టు గో' పోస్టర్స్ లో హీరో రామ్ కంటే ఎక్కువ ప్రాధాన్యం రాశి ఖన్నా గ్లామర్ కే కల్పించారు. దాదాపుగా అన్ని పోస్టర్లలో కాన్సెప్ట్ ఒకటే. అమ్మడి అందాలను బాగా ఫోకస్ చేసేశారు. నాభి సోయగాలు చూపించడం నుంచి.. రాశి డ్యాన్సింగ్ ట్యాలెంట్.. హీరోతో రొమాన్స్.. డ్రెసింగ్ లో డిఫరెంట్ నెస్.. ఇలా రాశి బాగానే ట్రై చేసిందనే విషయం పోస్టర్లలోనే అర్ధమైపోతోంది.

హీరోయిన్ అందాలను ప్రొజెక్టే చేసి బైటకొచ్చిన కమర్షియల్ సినిమాలకు.. ఓపెనింగ్స్ అదిరిపోతాయని రీసెంట్ గా భారీ బడ్జెట్ మూవీస్ కూడా ప్రూవ్ చేసేయడంతో.. ఇప్పుడు రాశి అందాల దెబ్బకు హైపర్ ఓపెనింగ్స్ గట్టిగానే ఉండే ఛాన్సుంది. తన కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్న రామ్ కోరిక నెరవేరడం ఖాయంగానే కనిపిస్తోంది.