అప్పుడు బెల్లం శ్రీదేవి - ఇప్పుడు క్లాస్ శ్రీదేవి

Sat Aug 11 2018 12:07:06 GMT+0530 (IST)

నితిన్ రాశి ఖన్నా జంటగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో దిల్ రాజు రూపొందించిన శ్రీనివాస కళ్యాణం టాక్ మొదటి ఆట నుంచే తేడాగా వచ్చినా స్లోగా పికప్ అవుతుందేమో అన్న అంచనాలకు భిన్నంగా కోలుకునే అవకాశం కనిపించడం లేదు. పోటీ పెద్దగా లేని నేపధ్యంలో వీక్ ఎండ్ బండి లాగించినా సోమవారం నుంచి కష్టమే అనేలా ఉంది పరిస్థితి. ఇక పోతే సినిమా కంటెంట్ మీద టేకింగ్ మీద ఎన్ని కామెంట్స్ కాంప్లిమెంట్స్ వచ్చినా వాటి వల్ల పూర్తిగా లాభపడింది ఒక్క రాశి ఖన్నా అని మాత్రమే చెప్పాలి. బాపు బొమ్మలా సినిమా పెళ్లి కూతురుకు సరైన నిర్వచనం ఇచ్చేలా అందంగా ఉన్న తన మీద మాత్రం ఒక్క నెగటివ్ మార్క్ రాలేదు. పైపెచ్చు అందరిని డామినేట్ చేసింది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఇది రాశి ఖన్నా చాలా కష్టపడి చేసుకున్న మేకోవర్. ఓ రెండేళ్ల వెనక్కు వెళ్లి రాశి ఖన్నాను చూస్తే ఇప్పటి రూపమే ఫ్లాష్ బ్యాక్ అనుకోవడం తధ్యం.ఇది వరుణ్ తేజ్ తో తొలిప్రేమ చేసినప్పుడే ఋజువు చేసుకున్న రాశి ఖన్నా శ్రీనివాస కళ్యాణంలో మరింత ఫ్రెష్ గా కనిపించి యూత్ ని బాగా వలలో వేసుకుంది. సో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రాశికి వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. ఒక ఏడాది కాలంగా రాశి ఖన్నాలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక హిట్టు ఒక ప్లాప్ అన్న రీతిలో సాగుతున్న రాశి ఖన్నా ప్రయాణం ఫిబ్రవరిలో రవితేజ టచ్ చేసి చూడు రూపంలో షాక్ కొడితే తక్కువ గ్యాప్ లోనే తొలిప్రేమ దాన్ని పూర్తిగా కవర్ చేసేసి మళ్ళి ట్రాక్ లో నిలబెట్టింది. ఇప్పుడు అమ్మడికి అవకాశాలకు లోటేమి లేదు. రాజమౌళి మల్టీ స్టారర్ కు తన పేరు కూడా ప్రతిపాదనలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. తొలిప్రేమ చూసాక జక్కన్న తన మీద సాఫ్ట్ గా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే మరో బంపర్ ఆఫర్ తగిలినట్టే. మొత్తానికి సుప్రీమ్ లో మాస్ బెల్లం శ్రీదేవిగా శ్రీనివాస కళ్యాణంలో క్లాస్ శ్రీదేవిగా మెప్పించడం ఇప్పుడున్న హీరోయిన్స్ ఒక రాశి ఖన్నాకే జరిగింది.