Begin typing your search above and press return to search.

లంకలో అందాల రాశి ఏం చేస్తుందో

By:  Tupaki Desk   |   23 Feb 2017 8:09 AM GMT
లంకలో అందాల రాశి ఏం చేస్తుందో
X
అందాల రాశి ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వెలిగిపోయింది. తన అందాలతో కుర్రాళ్లను.. అభినయంతో మహిళల మనసులను గెలుచుకున్న రాశి.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈమె.. ఇప్పుడు లంక అంటూ సోలోగా సక్సెస్ కోసం ప్రయత్నించేస్తోంది.

రాశి మెయిన్ లీడ్ గా నటిస్తున్న 'లంక'కు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. రెండు రకాల సీరియస్ లుక్స్ ను.. కంబైన్ చేసి డిఫరెంట్ గా రూపొందించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు శ్రీముని.. కొత్తగా ఏదో చూపించబోతున్నాడనే ఆసక్తిని జనరేట్ చేస్తోంది. పైగా ఇది థ్రిల్లర్ మూవీ కావడంతో.. అందుకు తగిన థీమ్ తోనే పోస్టర్ ను రూపొందించారు. కేరక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన రాశికి.. తన యాక్టింగ్ సత్తా చూపించేందుకు లంక మూవీ సరైన అవకాశం అని చెప్పాలి.

లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ కావడం.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుండడంతో.. లంకలో రాశి ఇప్పటికే ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు దినేష్ నామన.. విష్ణుకుమార్ నామనలు చెబుతున్నారు. అప్పట్లో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న రాశికి.. ఇప్పుడు తన ట్యాలెంట్ ను సత్తాను చూపే అవకాశం రావడం.. అదృష్టం అనే చెప్పాలి. మరి లంకలో ఈ అందాల రాశి ఏం చేస్తుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/