Begin typing your search above and press return to search.

రా రండోయ్.. వచ్చేశారు.. 3.4 కోట్లు ఇచ్చారు

By:  Tupaki Desk   |   27 May 2017 10:08 AM GMT
రా రండోయ్.. వచ్చేశారు.. 3.4 కోట్లు ఇచ్చారు
X
రా రండోయ్ వేడుక చూద్దాం అంటూ.. పండుగ చేసుకుందాం రమ్మని పిలిచాడు అక్కినేని నాగ చైతన్య. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ప్రేమ-పెళ్లి పండగలకు జనాలను ఆహ్వానిస్తే.. చైతు ఇన్విటేషన్ ను మన్నించి జనాలు థియేటర్లకు బాగానే వచ్చేశారు. అందుకే తొలి రోజు వసూళ్లు రికార్డు స్థాయిలో వచ్చాయి.

నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ డే గ్రాస్.. షేర్ ను వసూలు చేసిందంటే. 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీకి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో అర్ధమవుతుంది. తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీకి రూ. 3.4 కోట్ల షేర్ వసూలైంది. ఇది కేవలం థియేట్రికల్ షేర్ కాగా.. థియేటర్ అడ్వాన్సులేవీ ఇందులో లెక్కించలేదు. నైజాం ఏరియాలో తొలి రోజున 1.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది చైతు మూవీ. సీడెడ్ లో 52 లక్షలు.. ఉత్తరాంధ్రలో 44 లక్షలు.. గుంటూరులో 37 లక్షలు.. కృష్ణ 28 లక్షలు.. ఈస్ట్ 35 లక్షలు.. వెస్ట్ 28 లక్షలు.. నెల్లూరు 11 లక్షలు వసూలయ్యాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3.4 కోట్ల రూపాయల రికార్డ్ షేర్ వచ్చింది.

చాలా ఏరియాల్లో ఈ చిత్రాన్ని సొంతగానే రిలీజ్ చేసుకున్నారు నాగార్జున. ఈస్ట్ లో 1.21 కోట్లకు థియేట్రికల్ రైట్స్ ను అనిల్ సుంకరకు విక్రయిస్తే.. ఇక్కడి నుంచి 35 లక్షలు మొదటి రోజునే వచ్చాయి. అడ్వాన్స్ ముగింగ్స్ ట్రెండ్ చూస్తే తొలి వారాంతం ముగిసేసరికి 10 కోట్ల రూపాయల మార్క్ ను.. రారండోయ్ వేడుక చూద్దాం మూవీ తేలికగానే అందుకోనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/