Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: రాంగి.. ఇంట్రెస్టింగ్ గా ఉందే!

By:  Tupaki Desk   |   22 May 2019 2:46 PM GMT
ఫస్ట్ లుక్: రాంగి.. ఇంట్రెస్టింగ్ గా ఉందే!
X
తెలుగులో హీరోయిన్ గా త్రిష టైమ్ దాదాపుగా పూర్తయినట్టే కానీ తమిళంలో మాత్రం ఇంకా హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా త్రిష నటిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. 'రాంగి' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు శరవణన్.

ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు త్రిషను అదుపులోకి తీసుకుంటున్నారు. ఒక పోలీసు త్రిష చేతికి సంకెళ్ళు వేస్తున్నాడు. లోపల ఒక టీషర్ట్.. పైన ఒక షర్టు వేసుకున్న త్రిష ఎవరినో సీరియస్ గా చూస్తోంది. ఆ పోలీసుల యూనిఫామ్స్ చూస్తే ఇండియన్ పోలీసులు అనిపించడం లేదు. ఇదేదో విదేశాల్లో సాగే కీలక ఎపిసోడ్ కు సంబంధించిన సీన్ అయి ఉంటుంది.

స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి కథ.. డైలాగ్స్ అందించాడు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో సముద్రం అడుగున స్టంట్ సీక్వెన్సులను ప్లాన్ చేస్తున్నారట. ఇలా డీప్ సీ స్టంట్స్ ను ఒక సినిమా కోసం చిత్రీకరించడం ఇండియాలో మొదటిసారి అంటున్నారు. 'రాంగి' ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందట. నెక్స్ట్ షెడ్యూల్ ఉజ్బెకిస్తాన్ లో ఉంటుందని సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.