Begin typing your search above and press return to search.

అమ్మ‌డికి ఐదు ల‌వ్ స్టోరీస్ ఉన్నాయ‌ట‌

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:48 AM GMT
అమ్మ‌డికి ఐదు ల‌వ్ స్టోరీస్ ఉన్నాయ‌ట‌
X
ముద్దు ముద్దుగా క‌బుర్లు చెప్పే హీరోయిన్లు త‌మ‌లోప‌లి కోణాన్ని విప్పి చెప్పేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది అందాల ముద్దుగుమ్మ రాయ్ ల‌క్ష్మీ. ఎన్నిసార్లు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా తెలుగులో స‌క్సెస్ కాలేదు.

జూలీ 2తో బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానున్న రాయ్ ల‌క్ష్మీ.. ఈ చిత్రంలో ఆమె పోషించే పాత్ర‌కు మంచిపేరు వ‌స్తుంద‌ని చెబుతోంది. ఈ సినిమాకుఓకే చెప్ప‌టానికి నెల రోజులు ఆలోచించి ఓకే చెప్పానంటోది. బాలీవుడ్ చాన్స్ వ‌చ్చిన వెంట‌నే తాను చాలా ఆందోళ‌న చెందాన‌ని.. ఓ అమ్మాయి ఎదుర్కొనే స‌మ‌స్య‌ల చుట్టూ సినిమా క‌థ ఉండ‌టం త‌న‌ను ఆక‌ర్షించింద‌ని చెప్పింది.

ఇదే చాన్స్ తెలుగులో వ‌స్తే ఆలోచించేదానిన‌ని చెబుతోంది. ఈ సినిమా కోసం తాను చాలా సాహ‌సం చేశాన‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే రెమ్యున‌రేష‌న్ అడిగిన‌ట్లుగా ఆమె వెల్ల‌డించింది. ఇన్ని ముచ్చ‌ట్ల‌తో పాటు త‌న వ్య‌క్తిగ‌త అంశాల‌పైనా ఓపెన్ అయ్యింది.

త‌న‌కు మొత్తం అయిదు ల‌వ్ స్టోరీస్ ఉన్నాయ‌ని.. అన్ని బ్రేక‌ప్ అయ్యాయ‌ని చెప్పింది. ఎందుకిలా అన్న మాట అడ‌గ‌క‌ముందే త‌న ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీస్ గురించి చెప్పుకొచ్చింది. తన ప్రేమ క‌థ‌లు ఫెయిల్ కావ‌టానికి త‌న పాత్ర కూడా ఉంద‌ని.. త‌న‌కు ఎమోష‌న్స్ ఎక్కువ‌ని పేర్కొంది. తాను భావోద్వేగాల్లో ఉన్న‌ప్పుడు విప‌రీతంగా స‌త‌మ‌త‌మ‌వుతుంటాన‌ని వెల్ల‌డించింది. త‌న‌ను అర్థం చేసుకొని.. జాగ్ర‌త్త‌గా చూసుకునే వ్య‌క్తితో మాత్ర‌మే తాను సంతోషంగా ఉండ‌గ‌ల‌న‌ని పేర్కొంది. త‌న అయితే ల‌వ్ స్టోరీస్ ఫెయిల్ అయ్యాయ‌ని.. కాకుండే ఆ రిలేష‌న్స్ స్నేహాన్ని మిగిల్చిన‌ట్లుగా పేర్కొంది. ఏమైనా.. ఇంత ఓపెన్ గా త‌న ల‌వ్ ట్రాక్ ల‌ను చెప్ప‌టంలో రాయ్ ల‌క్ష్మీ త‌న‌దైన మార్కును ప్ర‌ద‌ర్శించింది క‌దూ.