Begin typing your search above and press return to search.

పవన్ ఐటెం ధోని సినిమాను వాడేసుకుంటోంది

By:  Tupaki Desk   |   27 Sep 2016 11:30 AM GMT
పవన్ ఐటెం ధోని సినిమాను వాడేసుకుంటోంది
X
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.దోని జీవితాన్ని ఆవిష్కరిస్తూ.. ''ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ'' అంటూ ఒక సినిమాను దించుతున్నారు. వచ్చే శుక్రవారమే సినిమా రిలీజవుతోంది. అయితే ఈ సినిమా ద్వారా తాను కూడా ప్రచారం పొందేయాలని చూస్తోంది సర్దార్ గబ్బర్ సింగ్ ఐటెం బాంబ్ లక్ష్మీ రాయ్. స్వయంగా పవన్ కళ్యాణే బ్రేక్ ఇవ్వలేకపోతే ఇక అమ్మడికి ఎవరు బ్రేకిస్తారు చెప్పండి?

మొన్నామధ్యన 'అకీరా' సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది లక్ష్మీ రాయ్. అవ్వడానికి కాల్ గాళ్‌ పాత్రే కాని.. అందులో అంతగా మ్యాటర్ లేదు. పైగా సినిమా కూడా ఆడకపోవడంలో అమ్మడి గురించి మాట్లాడినవారే లేరు. అందుకు అమ్మడు ఇప్పుడు ధోని సినిమాను వాడుకుంటోంది. 2008లో ఐపిఎల్ సమయంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ ధోనితో టీమ్ అంబాసిడర్ లక్ష్మీ రాయ్ డేటింగ్ చేస్తోందనే వార్తలొచ్చాయి. అవన్నీ ఎప్పుడో జనం మర్చిపోయారు.

కాని ఇప్పుడు ఈసుందరాంగి లక్ష్మీ రాయ్‌ మాత్రం.. ధోని సినిమాలో నా గురించి పాత్ర ఏమీ ఉండకపోవచ్చు.. ఎందుకంటే మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ జోకులు వేస్తోంది. అసలు ఈ ఐటెం పిల్లను ఇప్పుడు ధోని సినిమా గురించి అడిగిందెవరని.. ఈ కహానీలు వినిపించడానికి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/