Begin typing your search above and press return to search.

మెగా బాస్‌ ని ఇడిసిపెట్ట‌వా ర‌త్తాలూ?

By:  Tupaki Desk   |   22 Sep 2018 6:19 AM GMT
మెగా బాస్‌ ని ఇడిసిపెట్ట‌వా ర‌త్తాలూ?
X
ర‌త్తాలు ర‌త్తాలు ఓసోసి ర‌త్తాలు.. నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు..
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు..

`ఖైదీనంబ‌ర్ 150` చిత్రంలోని ఈ సాంగ్ అప్ప‌ట్లో ఓ ఊపు ఊపిన సంగ‌తి తెలిసిందే. ఆ ఐటెమ్ నంబ‌ర్ ఆ రేంజులో కుర్ర‌కారుకు కిక్కివ్వ‌డం వెన‌క రాయ్ లక్ష్మీ ప‌నిత‌నాన్ని పొగిడేయ‌కుండా ఉండ‌లేం. అప్ప‌టికే ఐటెమ్ భామ‌గా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్న రాయ్ లక్ష్మీకి మెగా ఐటెమ్ రూపంలో అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆ ఇమేజ్‌ తోనే ప‌లు చిత్రాల్లో ఐటెమ్ నంబ‌ర్ల‌కు సెట్ట‌య్యింది. అయితే బాస్ మెగాస్టార్‌ తో స్టెప్పేసే ఛాన్స్ ద‌క్కేస‌రికి ల‌క్ష్మీ చాలానే ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ ఇంకా ర‌త్తాలు మెగా బాస్‌ని మ‌ర్చిపోలేక‌పోతోంది. ప్ర‌స్తుతం సైరా- న‌ర‌సింహారెడ్డి చిత్రంలోనూ ర‌త్తాలు పోర్ష‌న్ ఏమైనా ఉందేమో అర్థం కావ‌డం లేదు ఇప్ప‌టికి.

రాయ్‌ ల‌క్ష్మీ న‌టిస్తున్న `వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి` షెడ్యూల్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో సాగుతోంది. ఆ క్ర‌మంలోనే మెగా బాస్‌ని క‌లిసింది ర‌త్తాలు. ఇదిగో లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ర‌త్తాలు ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఈ ఫోటోలో మెగాస్టార్‌ తో పాటు స‌తీమ‌ణి సురేఖ - కుమార్తె సుశ్మిత‌ ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోల‌న్నీ యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ర‌త్తాలు బాస్‌ ని ఇడిసిపెట్ట‌దా..? ఇంకో ఛాన్స్ ప్లీజ్ అంటూ వెంట‌ప‌డుతోందా? అంటూ గుస‌గుస‌లాడుతున్నారు మెగా ఫ్యాన్స్‌. ``వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి` షెడ్యూల్ పూర్త‌యింది. అల్టిమేట్ మ్యాన్ చిరంజీవి స‌ర్‌& ఫ్యామిలీతో ఈ మెమ‌ర‌బుల్ మూవ్‌ మెంట్ మ‌ర్చిపోలేను. వారిని క‌ల‌వ‌డం అంటే తిరిగి మా ఇంటికే వ‌చ్చిన‌ట్టుగా ఉంది`` అంటూ సంబ‌రంగా చెప్పుకుంది. వ్వాటీజ్ దిస్ ర‌త్తాలు.. ర‌చ్చ‌ర‌చ్చ ర‌చ్చాయ‌న‌మ‌హః!