Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్ ప్రభంజనానికి ఇది నిదర్శనం

By:  Tupaki Desk   |   22 July 2018 7:24 AM GMT
ఆర్ ఎక్స్ ప్రభంజనానికి ఇది నిదర్శనం
X
ఈ వీకెండ్లో ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కానీ వాటి ప్రభావం ఎంతమాత్రం ముందు వారంలో విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ మీద కనిపించలేదు. కొత్త సినిమాలకు తొలి రోజు వచ్చిన వసూళ్ల కంటే కూడా ‘ఆర్ ఎక్స్ 100’కు తొమ్మిదో రోజు.. పదో రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఈ సినిమాలన్నింటికీ వచ్చిన వసూళ్లు ‘ఆర్ ఎక్స్ 100’ ఒక్కదానికి వచ్చిన వసూళ్లతో సమానంగా ఉంటుండటం షాకిచ్చే విషయం.

హైదరాబాద్ లో ప్రఖ్యాత థియేటర్లున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వసూళ్లను పరిశీలిస్తే ‘ఆర్ ఎక్స్ 100’ ప్రభంజనం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. శనివారం ఉదయం దేవి 70 ఎంఎం థియేటర్లో ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాకు రూ.52 వేల దాకా గ్రాస్ వస్తే.. కొత్త సినిమా ‘లవర్’కు రూ.25 వేల లోపు గ్రాస్ వసూలైంది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ చిత్రానికి ఉదయం కేవలం రూ.4800 గ్రాస్ మాత్రమే వచ్చింది. ‘ఆటగదరా శివ’ రూ.6 వేల దాకా వసూలు చేసింది. శనివారమే రిలీజైన ‘పరిచయం’ సినిమా మార్నింగ్ షోకు రూ.25 వేలు వసూలు చేసింది. తర్వాతి మూడు షోలకు ‘ఆర్ఎక్స్ 100’ వరుసగా రూ.62 వేలు.. రూ.56 వేలు.. రూ.81 వేలు వసూలు చేసింది.

దీని ముందు మిగతా సినిమాలన్నీ దిగదుడుపే. ఓవరాల్‌ గా రోజు మొత్తంలో ‘ఆర్ ఎక్స్ 100’ వసూళ్లు.. మిగతా నాలుగు కొత్త సినిమాల వసూళ్లు దాదాపు సమానంగా ఉన్నాయి. ఆదివారం ‘ఆర్ ఎక్స్ 100’ మరింత జోరు చూపించే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద థియేటర్లలో ఒకటైన దేవి 70 ఎంఎంలో ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి చిన్న సినిమా తొలి వారం హౌస్ ఫుల్స్ తో నడవడమే పెద్ద సంచలనం. రెండో వారంలో కూడా ఆ సినిమా జోరు అలాగే కొనసాగుతోంది.