రయ్ రయ్ మంటూ బ్లాక్ బస్టర్ కొట్టారు!

Sat Jul 14 2018 21:57:38 GMT+0530 (IST)

గత ఏడాది విడుదలైన కల్ట్ క్టాసిక్ `అర్జున్ రెడ్డి` టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బోల్డ్ కథను కన్విన్సింగ్ గా చెప్పడంలో ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సక్సెస్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో `అర్జున్ రెడ్డి`తరహాలో హైప్ తెచ్చుకున్న మరో మూవీ `ఆర్ ఎక్స్ 100`. చిత్ర టీజర్ - ట్రైలర్ లు యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దర్శకుడు అజయ్ భూపతి....ఎంచుకున్న బోల్డ్ కథ...ప్రేక్షకులను మెప్పిస్తోంది. హిట్ టాక్ తో దూసుకుపోతోన్న ఈ చిత్రం....తొలిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అదే ఊపుతో ఈ సినిమా...రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.బోల్డ్ రా కంటెంట్ తో పాటు క్రైమ్ కూడా మిక్స్ చేసిన ఈ చిత్ర కథకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. మరో`అర్జున్ రెడ్డి`అనిపించేలా ఉండడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై డివైడ్ టాక్ ఉంది. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా...రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ముఖ్యంగా యూత్ - మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియాట్రికల్ రన్ లో ఈ చిత్రం 10 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. మరోవైపు ఈ చిత్రంతో పాటు విడుదలైన`విజేత`కు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా...వీకెండ్స్ లో పుంజుకుంటుందేమో వేచి చూడాలి. కార్తి హీరోగా నటించిన` చినబాబు`కు డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ....వీకెండ్ లో వసూళ్లు రాబడితేనే రేస్ లో నిలబడుతుంది. ఈ వారం విడుదలైన మూడు చిత్రాలలో `ఆర్ ఎక్స్ 100`పేరుకు తగ్గట్లే మిగతా చిత్రాలను వెనక్కు నెట్టి.... రయ్ రయ్ మంటూ దూసుకుపోతోంది.