Begin typing your search above and press return to search.

'RX 100' హీరో నిర్ణయం కరెక్టేనా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 1:26 PM GMT
RX 100 హీరో నిర్ణయం కరెక్టేనా?
X
గత ఏడాది సంచలన విజయాన్ని దక్కించుకున్న చిన్న చిత్రం 'ఆర్‌ ఎక్స్‌ 100'. ఆ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ మాస్‌ ఆడియన్స్‌ ను అలరించాడు. మొదటి సినిమాతోనే మాస్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న కార్తికేయ ఆ తర్వాత రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఒక సినిమా కూడా సెట్స్‌ పై ఉంది. ఆ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కార్తికేయ వద్దకు ఇంకా ఎంతో మంది యువ దర్శకులు కథలతో వెళ్లారు. అయితే ఇతడు మాత్రం ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు.

ఒక వైపు హీరోగా ఆఫర్లు వస్తున్నా కూడా నాని మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందబోతున్న విభిన్న కథాంశ చిత్రంలో కార్తికేయ కీలక పాత్రలో నటించబోతున్నాడు. నేడు ప్రారంభం అయిన షూటింగ్‌ కార్యక్రమాల్లో కార్తికేయ పాల్గొనడం జరిగింది. హీరోగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటీ అంటూ ఎక్కువ శాతం మంది కార్తికేయ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

కాని కార్తికేయ మాత్రం చాలా ఆలోచించి ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. హీరోగానే నటించి సక్సెస్‌ అవ్వాలని కార్తికేయ అనుకోవడం లేదట. అందుకే నాని మూవీలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో తప్పకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో కార్తికేయ ఉన్నాడట. అందుకే విక్రమ్‌ కుమార్‌ ఆఫర్‌ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీలో కార్తికేయ విలన్‌ గా లేదంటే పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించనున్నాడంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో చర్చ జరుగుతుంది. నటుడిగా నిరూపించుకునేందుకు కార్తికేయ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సిందే. నాని మూవీలో మంచి పాత్ర దక్కితే మాత్రం కార్తికేయ నిర్ణయం కరెక్టే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.