Begin typing your search above and press return to search.

హీరోల చక్రవ్యూహంలో టాలెంటెడ్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   19 March 2019 6:20 AM GMT
హీరోల చక్రవ్యూహంలో టాలెంటెడ్ డైరెక్టర్
X
పరిశ్రమలో కొన్నిసార్లు అంతే. ఎంత టాలెంట్ చేతిలో ఉన్నా సక్సెస్ తో మనమేంటో ప్రూవ్ చేసుకున్నా టైం కొంత కలిసి రానప్పుడు అనుకున్నవి జరగడంలో ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి పరిస్థితి అలాగే ఉంది. ఆరెక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఒక్కసారిగా అందరూ తనవైపు చూసేలా చేసుకున్న అజయ్ ప్రస్తుతం రెండో సినిమా మొదలుపెట్టే విషయంలో జాప్యాన్ని ఎదురుకుంటూనే ఉన్నాడు.

గత ఏడాదే క్రేజ్ ఉన్న యూత్ హీరోలు కొందరు చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ కాల్ షీట్స్ సమస్య వల్ల అజయ్ భూపతి సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. మహాసముద్రం పేరుతో ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందని సబ్జెక్టు విపరీతంగా నచ్చేసిన సమంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కొద్దిరోజుల క్రితమే టాక్ వచ్చింది. కాకపోతే ఇది ఇద్దరు హీరోలను డిమాండ్ చేసే మల్టీ స్టారర్ కావడంతో లేట్ అవుతోంది

తన సన్నిహితుల దగ్గర డైరెక్టర్ చెబుతున్న వెర్షన్ ప్రకారం ఒక్కసారి ఆ హీరోల డేట్స్ వచ్చేస్తే వెంటనే మొదలుపెట్టి తక్కువ టైంలోనే ఫినిష్ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు చెబుతున్నాడట. ఆయనకు ఫేవర్ గా ఉన్న హీరోల లిస్ట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రామ్ నితిన్ లతో పాటు మరో ఇద్దరు పరిశీలనలో ఉన్నారట. ఇవన్నీ వీలైనంత త్వరగా కొలిక్కి వస్తే రెండో సినిమా అంత త్వరగా ప్రారంభమవుతుంది. ఆరెక్స్ 100లో గతంలో చూడని ఓ సరికొత్త లవ్ స్టోరీ తనదైన ట్రీట్మెంట్ తో మెప్పించిన అజయ్ భూపతి రెండో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న యూత్ ప్రేక్షకులు భారీగానే ఉన్నారు