Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ - రెండో అడుగు పడింది

By:  Tupaki Desk   |   21 Jan 2019 6:09 AM GMT
ఆర్ ఆర్ ఆర్ - రెండో అడుగు పడింది
X
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ రెండో షెడ్యూల్ ఇవాళ నుంచి మొదలైపోయింది. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఇకపై నిర్విరామంగా దీని కోసం వర్క్ చేయబోతున్నారు. అందరూ బాహుబలి తరహాలో ఇది కూడా విపరీతంగా ఆలస్యం అవుతుందని భావిస్తున్న నేపధ్యంలో ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ ఒక్క ఏడాదిలోనే షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా జక్కన్న ఫుల్ ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం.

ఇద్దరు హీరోలు ఉండే సీన్లు తాను టేకప్ చేస్తూనే ఇతర ఆర్టిస్టులతో తీసే సన్నివేశాల కోసం మరో రెండు యూనిట్లు సిద్ధం చేసి ఉంచాడట. తన టీమ్ లో అత్యంత నమ్మకస్తులను సెట్ చేసుకున్న రాజమౌళి ఎక్కడా గ్యాప్ రాకుండా వేగంగా పనులు జరిగేలా ముందే సూచనలు ఇచ్చాడట. ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ మాత్రం ఎక్కువ రోజులు ఉంటుందని తెలిసింది. తారక్ చరణ్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు. సినిమాలోనే 27వ సీన్ తో ఇవాళ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఫోటోను టీం అధికారికంగా పోస్ట్ చేసింది.

తారక్ చరణ్ పాత్రలపై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కాని రాజమౌళి మాత్రం ఎక్కడా మాటవరసకు కూడా దీని గురించి ప్రస్తావించడం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయి బిజినెస్ జరిగే మూవీగా ఆర్ ఆర్ ఆర్ మీదే అంచనాలు ఉన్నాయి. ఇవి కనక అందుకుంటే ఫాంటసీతో పాటు కమర్షియల్ సబ్జెక్టు తో కూడా వేల కోట్లు రాబట్టవచ్చని రుజువు చేసినట్టు అవుతుంది. స్వతంత్రం రాకముందు ప్లస్ వర్తమానం ఇలా రెండు బ్యాక్ డ్రాప్స్ లో ఆర్ ఆర్ ఆర్ ఉంటుందని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఇంకొంత కాలం ఓపిక పడితే క్లారిటీ రావొచ్చు