Begin typing your search above and press return to search.

తారక్ తో ఆర్ ఆర్ ఆర్ రీ స్టార్ట్

By:  Tupaki Desk   |   27 May 2019 7:28 AM GMT
తారక్ తో ఆర్ ఆర్ ఆర్ రీ స్టార్ట్
X
అంచనాలకు అందని రేంజ్ లో రూపొందుతున్న రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ గత కొంత కాలం వాయిదా పడిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు చీలమండల గాయం దెబ్బకు ఏకంగా మూడు వారాలు పోస్ట్ పోన్ చేసుకున్న ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేతికి చిన్న దెబ్బ కలగడంతో ఇంకొన్ని రోజులు ఆగింది. ఇప్పుడు అన్ని సమిసిపోయాయి. ఇవాల్టి నుంచి ఆర్ ఆర్ ఆర్ హైదరాబాద్ లో గతంలో వేసిన అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ లో తిరిగి కొనసాగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఇందులో జాయిన్ అయ్యాడు. తన మీద ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. ఇది రెండు వారాల పాటు కొనసాగుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఇందులో రామ్ చరణ్ ఉండడు. కేవలం తారక్ కు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే తీస్తారు. ఇది అయ్యాక అహ్మదాబాద్ వెళ్ళిపోయి అక్కడ అలియ భట్ రామ్ చరణ్ లతో పాటు మిగిలిన తారాగణంతో అప్పుడు ఆగిపోయిన పార్ట్ ని కంటిన్యూ చేస్తారు. మొత్తంగా నెలన్నర గ్యాప్ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ని రాజమౌళి బాలన్స్ చేసే పనిలో ఉన్నారు.

వచ్చే ఏడాది జూలై 30 అని డేట్ ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు వచ్చే బ్రేక్స్ అన్ని దాని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇదంతా రికవర్ చేయాలంటే కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. జూనియర్ సరసన నటించబోయే భామ గురించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు. టాలీవుడ్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో బిజినెస్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ కు బుర్ర సాయి మాధవ్ సంభాషణలు సమకూరుస్తుండగా కీరవాణి స్వరాలు అందిస్తున్నారు