న్యూ ఇయర్ స్పెషల్... #RRR టైటిల్ ఫిక్స్

Tue Jan 01 2019 17:08:16 GMT+0530 (IST)

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతి తర్వాత మరో షెడ్యూల్ ను జక్కన్న ప్లాన్ చేశాడు. మామూలుగా అయితే రాజమౌళి తన సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే టైటిల్ ను అనౌన్స్ చేస్తాడు. కాని ఈసారి మాత్రం సస్పెన్స్ లో పెడుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ అంటూ వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతానికి పని కానిచేస్తున్నాడు.ఇప్పటి వరకు జక్కన్న టైటిల్ ప్రకటించని నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రంకు ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మూడు ఆర్ లు కలిసేలా జక్కన్న ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా పుకార్ల వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా పలు టైటిల్స్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘రాజసం’ అనే టైటిల్ కూడా బలంగా వినిపించింది. కాని ఇప్పటి వరకు ఏది కూడా క్లారిటీ రాలేదు.

రెండవ షెడ్యూల్ పూర్తి అయ్యే సమాయానికి అంటే వేసవి ప్రారంభం వరకు సినిమా టైటిల్ ను ప్రకటించాలని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకోసం పలు టైటిల్స్ ను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్స్ విలన్ ఎవరు అనే విషయంపై కూడా సెకండ్ షెడ్యూల్ సమయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది.