Begin typing your search above and press return to search.

RRRకి అంత భారీ మేక‌ప్ ఎందుకు?

By:  Tupaki Desk   |   11 Nov 2018 4:57 PM GMT
RRRకి అంత భారీ మేక‌ప్ ఎందుకు?
X
బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా అంటే ఎంత పెద్ద అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే భారీగా అతిధుల స‌మ‌క్షంలో RRR లాంచింగ్ వేడుక నేడు హైద‌రాబాద్ లో సాగింది. మీడియా - అభిమానుల సంద‌డి లేకుండా క‌ట్టుదిట్టంగా జ‌క్క‌న్న దీనిని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌ పై జాతీయ మీడియా క‌న్ను ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే లోక‌ల్ మీడియా నుంచి జాతీయ మీడియా వ‌ర‌కూ ప్ర‌తిదీ విజువ‌ల్స్ రూపంలో - ఫోటోల రూపంలో డివివి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ స్వ‌యంగా అధికారిక‌ సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌మోట్ చేసింది. ఈ ఈవెంట్‌ కి దాదాపు 30 మంది అతిధులు ఎటెండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి - ప్ర‌భాస్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఈవెంట్ ఇది.

ఈవెంట్ జ‌రిగిన సెట్స్‌ లో భారీగానే పూజా మంట‌పం డెక‌రేష‌న్‌ కి ఖ‌ర్చు చేశారు. ఆ ప‌రిస‌రాల్ని సొంత కెమెరాలతో చిత్రీక‌రించి దాని ఫుటేజ్ బ‌య‌టికి వ‌దిలారు... స్టార్ల‌కు ఫ్యాన్స్ రిస్క్ లేకుండా ప్ర‌శాంతంగా కార్య‌క్ర‌మం కానిచ్చేశారు. అయితే ఈ వేడుక‌కు ఎందుకంత మేక‌ప్ అంటే.. కేవ‌లం జాతీయ మీడియాని దృష్టిలో ఉంచుకుని - అలాగే ప్రాజెక్టు రేంజును ఎలివేట్ చేసేందుకేన‌ని గెస్టులు మాట్లాడుకోవ‌డం విశేషం. జాతీయ స్థాయిలో మీడియా దృష్టి సారించే ఈవెంట్ గ‌నుక‌.. రాజ‌మౌళి ఇంత హంగామా ప్లాన్ చేశార‌ట‌. ఇక డివివి సంస్థ‌లో ఇదివ‌ర‌క‌టి సినిమాలు బ్రూస్‌ లీ - భ‌ర‌త్ అనే నేను చిత్రాల‌కు అయితే ఇంత హంగామానే లేదు. అప్పుడు చాలా సాధాసీదాగానే ప్రారంభోత్స‌వాలు చేశారు. వాటితో పోలిస్తే పెద్ద రేంజు.. మోస్ట్ అవైటెడ్ సినిమా అన్న సంకేతాల్ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోకి పంపించే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ఈవెంట్ గెస్టుల‌తో పాటు చిత్ర యూనిట్ అంద‌రినీ మెగాస్టార్ చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్‌ - తార‌క్ ప్ర‌త్యేకించి షేక్ హ్యాండ్ ఇచ్చి ట‌చ్‌ లోకి వెళ్లారు. ఆ మొత్తం దృశ్యాల్ని వీడియో ఫుటేజ్‌ లో చిత్రీక‌రించి దాన‌య్య మీడియా సామాజిక మాధ్య‌మాల్లో అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇక ఈ భారీ ప్రాజెక్టు మొత్తానికి రాజ‌మౌళి మాత్ర‌మే ఎగ్జిక్యూష‌న్ చేస్తార‌ట‌. ద‌ర్శ‌క‌త్వం స‌హా ప్ర‌తిదీ రాజ‌మౌళి - అత‌డితో ఉండే బృందం గుండు సూది నుంచి లంచ్ బాక్స్ వ‌ర‌కూ - ప్రాజెక్టు కు సంబంధించిన ప్ర‌తి వ్య‌వ‌హారం చూసుకుంటారట‌. నిర్మాత అని చెబుతున్న‌.. డి.వి.వి.దాన‌య్య కేవ‌లం ఫైనాన్షియ‌ర్‌ గా మాత్ర‌మే కొన‌సాగుతార‌ని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డం - సేఫ్‌ గా బిజినెస్ చేసి పెట్ట‌డం - లాభాల్ని చేతిలో పెట్ట‌డం రాజ‌మౌళి ఇచ్చిన క‌మిట్‌ మెంట్ అన్న మాటా వినిపిస్తోంది. ఇక క‌థానాయ‌కులు రామ్‌ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ పారితోషికాల బేసిస్‌ లో కాకుండా లాభాల్లో వాటా ప్రాతిప‌దిక‌న న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది.