Begin typing your search above and press return to search.

మమ్మల్ని కులశేఖర్‌ నాశనమవుతారు అన్నాడు!

By:  Tupaki Desk   |   10 Nov 2018 1:30 AM GMT
మమ్మల్ని కులశేఖర్‌ నాశనమవుతారు అన్నాడు!
X
తెలుగులో వంద సినిమాల్లోకి పైగా పాటలు రాసిన కులశేఖర్‌ ఈమద్య దొంగతనం కేసులో అరెస్ట్‌ అవ్వడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. కులశేఖర్‌ గురించి పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు. కుటుంబం మరియు బ్రహ్మణ సమాజం ఆయన్ను వెలివేడయం వల్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని - ఆయన మానసిక పరిస్థితి బాగాలేని కారణంగానే దొంగతనాలు చేస్తున్నట్లుగా తెలిసింది. పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించిన నేపథ్యంలో కులశేఖర్‌ తో తమ అనుబంధంను ఆర్పీ పట్నాయక్‌ మీడియాతో షేర్‌ చేసుకున్నాడు.

తేజతో ‘చిత్రం’ చేయక ముందు నుండి నాకు కులశేఖర్‌ తో పరిచయం ఉంది. చిత్రం సినిమాలో కుక్కకావాలి.. పాటను రాయించేందుకు తేజ గారు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో కులశేఖర్‌ ను పరిచయం చేశాను. తేజకు కావాల్సినట్లుగా పాటను ఇచ్చాడు. అప్పటి నుండి కూడా కులశేఖర్‌ ఎన్నో చిత్రాలకు మంచి పాటలు రాశాడని ఆర్పీ అన్నారు. నేను స్వరపర్చిన ఎన్నో పాటలను కులశేఖర్‌ రాయడం జరిగిందని ఆర్పీ పట్నాయక్‌ చెప్పుకొచ్చాడు. కుశేఖర్‌ అన్ని విధాలుగా పర్వాలేదు కాని ఒక విషయం కారణంగానే ఆయన ఇండస్ట్రీలో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.

కులశేఖర్‌ ఏదైనా పాటను రాసినప్పుడు దాన్ని తనదైన ట్యూన్‌ లో వినిపిస్తాడు. అలాగే ఒక సారి ఢిల్లీ నుండి గల్లీ దాకా... అంటూ తను రాసిన పాటను వినిపించాడు. ఒక ట్యూన్‌ లో పాడటంతో నేను - తేజ - నిహాల్‌ నవ్వేశాం. ఆయన ట్యూన్‌ అస్సలు సరిగా లేకపోవడంతో పాటు - ఫన్నీగా అనిపించడం వల్ల మేం నవ్వాం. కాని అందుకు ఆయన చాలా సీరియస్‌ అయ్యాడు. ఒక కళాకారుడిని అవమానించినందుకు మీరు నాశనం అయిపోతారు అంటూ ఊగిపోయాడు. నీ లిరిక్‌ బాగుంది - ట్యూన్‌ సరిగా లేదని చెప్పేందుకు ప్రయత్నించినా కూడా అతడు వినలేదు.

కోపం తగ్గిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకుంటాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోతుంది. నాకు ఆయన కోపం పూర్తిగా తెలుసు కనుక ఎన్నిసార్లు ఆయన నన్ను తిట్టినా కూడా తర్వాత కలిసి పోయాం. కాని అందరు అలా ఉండరు కదా. అందుకే కులశేఖర్‌ కు అవకాశాలు మెల్ల మెల్లగా తగ్గాయని ఆర్పీ పేర్కొన్నాడు.