Begin typing your search above and press return to search.

మహేష్‌ ఐదుగురు ఏంజెలినా జోలీల్లా...

By:  Tupaki Desk   |   27 Aug 2016 7:30 AM GMT
మహేష్‌ ఐదుగురు ఏంజెలినా జోలీల్లా...
X
మామూలుగా ఇప్పటివరకు ఎన్నడూ మీరు వినని కంపారిజన్ ఇదే కావొచ్చు. అలాంటి ఒక పోలికనే పోల్చాడు ఒక తమిళ నటుడు. కోలీవుడ్ లో ఆర్.జె. బాలాజీ అంటే చాలా ఫ్యామస్. మనోడు నిజంగానే ఒక రేడియోలో ఆర్.జె. గా పనిచేస్తాడు. అంతేకాకుండా సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో మహేష్‌ ప్రక్కనే ఉండే స్నేహితుడిగా ఒక క్రూషియల్ రోల్ ను పట్టేశాడు.

ఈ సందర్భంగా మనోడు మాట్లాడుతూ.. ''అసలు మురుగుదాస్ సార్ సినిమా అంటేనే సూపర్. అది కాకుండా అందులో మహేష్‌ బాబు ప్రక్కనే చేయడమంటే ఇంకా అద్భుతం. నేను ఈ సినిమాలో ఏదో ఒక కమెడియన్ తరహా పాత్రలో కనిపించట్లేదు. సినిమాలోని చాలా ముఖ్యమైన సీన్లలో హీరో ప్రక్కనే ఉండే ఫ్రెండుగా కనిపిస్తాను'' అంటూ చెప్పాడు. మరి ఇంతకీ మహేష్‌ బాబును కలిశాడా?? ''రెండు రోజుల క్రితమే ఆయనతో షూటింగులో జాయిన్ అయ్యా. అసలు మహేష్‌ హైట్ కాని.. ఆ కలర్ కాని.. అబ్బో రచ్చ. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఐదుగురు ఏంజెలినా జోలీలను (ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్) కలిపితే ఎంత ఛార్మింగ్ గా ఉంటుందో.. మహేష్‌ అలా ఉన్నాడు'' అంటూ మన సూపర్ స్టార్ అందాన్ని పొగిడేశాడులే.

మొత్తానికి మహేష్‌ హ్యాండ్సమ్ లుక్స్ హీరోయిన్లనే కాదండోయ్.. హీరోలను కూడా ఛార్మ్ చేస్తున్నాయి అనమాట.