బెనిఫిట్ షోలను కామెడీ చేస్తున్నారా?

Wed Feb 20 2019 10:10:52 GMT+0530 (IST)

తెల్లవారుఝామున ఇంకా చీకట్లు తొలగకముందే అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షో కోసం థియేటర్ల ముందు బారులు తీరడం ఏ బాషలోనూ కొత్తేమి కాదు. ఇప్పుడంటే హైదరాబాద్ లో అనుమతులు ఇవ్వడం లేదు కాని మొన్నటి దాకా అర్ధరాత్రిళ్ళు షోలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇలాంటివి కేవలం పెద్ద హీరోలకే పరిమితం కావడం సాధారణ విషయం. కాని కోలీవుడ్ లో మాత్రం ఓ విభిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన సినిమాలకు కూడా ఎర్లీ మార్నింగ్ షో వేయడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.సపోరింగ్ రోల్స్ లో ఎక్కువ కనిపించే ఆర్ జె బాలాజీ నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ఎల్ కేజి ఈ శుక్రవారం విడుదల కానుంది. దీని కోసం చెన్నైతో సహా పలు ముఖ్య నగరాల్లో ఉదయం 5 గంటలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారు. బుకింగ్స్ కూడా మొదలుపెట్టేసారు. ఇలాంటి చిన్న హీరోలకు ప్రీమియర్ షోలు వేసి వాటి విలువ తీస్తున్నారని రట్ససన్ హీరో విష్ణు విశాల్ తన ట్విట్టర్ లో కామెంట్ చేయడం చిన్న పాటి దుమారం రేపింది

ఇది చాలదు అన్నట్టు మార్చ్ 1 రానున్న యూత్ సెన్సేషన్ ఒవియా అడల్ట్ కంటెంట్ మూవీ 90 ఎంఎల్ కు సైతం ఇలాంటి 5 గంటల షోలు ప్లాన్ చేయడం మరో ట్విస్ట్. ఇప్పటికే మహా బూతు సినిమాగా దీని మీద హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓవియా తన మీద వచ్చిన విమర్శలను లెక్క చేయకుండా నాఇష్టం వచ్చిన సినిమాల్లో నటిస్తాను అని ప్రకటన ఇవ్వడం సంచలనం రేపింది.

మొత్తంగా ఇలా కామెడీ ప్లస్ అడల్ట్ సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు వేసే కొత్త సంప్రదాయం పుట్టించడం బాగానే ఉంది మ్యాట్నీ  పడేలోపే వాటి జాతకం బయట పడుతుంది కాబట్టి ఆ దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద పడే అవకాశం గురించి నిర్మాతలు అలోచించినట్టు లేరు . ఈ వరస చూస్తుంటే కోలీవుడ్ లో ఇకపై ఉదయం 5 గంటల షోలు చాలా మాములు విషయమైపోయేలా ఉంది