వర్మ సినిమాకే ఓట్లు పడుతున్నాయి

Mon Feb 18 2019 16:04:31 GMT+0530 (IST)

లక్ష్మిస్  ఎన్టీఆర్ గురించి రోజు ఏదో ఒక రూపంలో చర్చ నడుస్తూ ఉండేలా రామ్ గోపాల్ వర్మ వేస్తున్న ఎత్తుగడలు అన్ని ఇన్ని కావు. ఇది కనక ఆ మహానటుడి సినిమా కాకపోయి ఉంటే ఎవరూ పట్టించుకునే వారు కాదు కాని ఆయన రాజకీయ జీవితంలోని వెన్నుపోటు ఆధారంగా తీసినది కావడంతో ఎక్కడ లేని ఆసక్తి వచ్చి చేరింది. అందుకే దీని మీద హైప్ డౌన్ కాకుండా వర్మ శాయశక్తులా కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నాడు. సినిమా ఎలా ఉంటుంది అనేది వీటిని  బట్టి ఊహించుకుంటే తప్పులో కాలెసినట్టు అవుతుంది కాని మొత్తానికి వర్మ చాలా కాలం తర్వాత కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకున్న మాట మాత్రం వాస్తవం.ఇక మహానాయకుడుతో పోలికల విషయంలో సైతం వర్మ ఎక్కడా తగ్గడం లేదు నిన్న ఏకంగా తన ట్విట్టర్ లో ఏ సినిమా ఎక్కువ నిజాయితిగా నిజాలతో ఉంటుంది అనే ప్రశ్న ఇచ్చి మహానాయకుడు లక్స్మిస్ ఎన్టీఆర్ అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి భారీగా  41 వేల 734 మంది ఓట్ల రూపంలో స్పందించారు. 690 రీ ట్వీట్లు పడ్డాయి. ఏకంగా 4 వేలకు పైగా లైకులు కొట్టేసారు. ఇంతకీ విజేత ఎవరు అనుకుంటున్నారా. ఇంకెవరు. లక్ష్మీస్ ఎన్టీఆరే. 85 శాతం ఓట్లు దీనికే రాగా మహానాయకుడు కేవలం 15 శాతం ఓట్లతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్ అని నందమూరి ఫ్యాన్స్ కొట్టెయవచ్చు. కాని ట్విట్టర్ అనేది పబ్లిక్ ప్లాట్ ఫారం. కేవలం వర్మ అభిమానులు మాత్రమే అతనికి అనుకూలంగా స్పందిస్తారు అనుకోవడానికి లేదు. ఎవరైనా ఓటు వేయొచ్చు. ఆ లెక్కన చూసుకుంటే ప్రేక్షకుల్లో లక్మిస్ ఎన్టీఆర్ మీద ఆసక్తి తేటతెల్లమవుతోంది. కామెంట్లు సైతం అలాగే వచ్చాయి. సూర్యుడు విద్యుత్ బల్బులో ఏది వేడిది అని అడిగితే ఎలా అంటూ మంచి కామెడీనే చేసారు