Begin typing your search above and press return to search.

వర్మకు చైతుకు క్లాష్ తప్పదా

By:  Tupaki Desk   |   24 March 2019 6:07 AM GMT
వర్మకు చైతుకు క్లాష్ తప్పదా
X
అందరూ ఆశిస్తున్నట్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 29 విడుదల కావడం అనుమానంగానే ఉంది. సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. వర్మ కూడా సోషల్ మీడియాలో దీని గురించి ఖచ్చితంగా ఏమి చెప్పకుండా నాన్చుతూనే ఉన్నాడు. నాదేం లేదు అంతా సెన్సార్ చేతుల్లో ఉందంటూ తప్పుకుంటున్నాడు. ఒకవేళ సోమవారం లేదా మంగళవారం సెన్సార్ పూర్తి చేసుకున్నా ఆపై మిగిలే రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దీన్ని విడుదల చేయడం సాధ్యమేనా అంటే సినిమా జనాల నుంచి నో అనే ఆన్సరే వస్తోంది.

అసలు ఏ కట్స్ చెబుతారో తెలియదు. మార్పులు సూచిస్తారో లేదో అర్థం కావడం లేదు. సో ఇంత తక్కువ టైంలో అవన్నీ పూర్తి చేసి మళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎంత లేదన్నా రెండు మూడు రోజులు కావాలి. ఈ లోపు 29 దాటిపోతుంది. వర్మ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేదే సస్పెన్స్ గా మారింది

ఒకవేళ ఇప్పుడూ కుదరకపోతే ఏప్రిల్ 5 వాయిదా వేయాల్సి ఉంటుంది. అదే రోజు నాగ చైతన్య సమంతాల మజిలి ఉంది. రెండు సినిమాలకు పోటీ లేనప్పటికీ పూర్తి వ్యతిరేకమైన జానర్లు అయినప్పటికీ ఎంతో కొంత వర్మ ఎఫెక్ట్ అయితే పడుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కేవలం వివాదాల ఆధారంగా హైప్ తెచ్చుకుంది. అది మినహాయిస్తే ఒక్కటంటే ఒక్కటీ తెలిసిన మొహం లేదు.

మజిలి అలా కాదు. స్టార్ అట్రాక్షన్స్ ఉన్నాయి. టాక్ పాజిటివ్ గా వస్తే చాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని లెక్క చేయాల్సిన పని ఉండదు. ఎటొచ్చి ఫస్ట్ డే ఈ రెండు క్లాష్ అయితే సాధారణ ప్రేక్షకులు మళ్ళి ఏమైనా బ్యాన్ చేస్తారేమో అన్న ఆత్రుతతో వర్మ సినిమాకు మొగ్గు చూపొచ్చేమో కాని అంతకు మించి మజిలి టెన్షన్ పడేందుకు ఏమి లేదు. ఏప్రిల్ 5 దాటిపోతే ఆపై శుక్రవారం వచ్చే లోపు ఎన్నికలు అయిపోయి ఉంటాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ బజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మరి సినిమా కథను మించిన మలుపులు చూపిస్తున్న ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో