స్టంట్లందు సాహో స్టంట్ల లెక్కే వేరయా

Wed Jun 13 2018 10:01:40 GMT+0530 (IST)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహోలో యాక్షన్ ఎపిసోడ్లు చాలా స్పెషల్ గా ఉంటాయని ఫిలిం మేకర్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రన్ రాజారన్ ఫేం డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో 8 నిమిషాల పాటు కనిపించే యాక్షన్ ఎపిసోడ్ ను రీసెంట్ గా దుబాయ్ లో షూట్ చేశారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం నిర్మాతలు వెచ్చించిన మొత్తం రూ. 70 కోట్లు. ఈ యాక్షన్ సీన్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నాడు సాహో సినిమాటోగ్రాఫర్ మది.‘‘దుబాయ్ యాక్షన్ ఎపిసోడ్ కోసం వాడినదంతా లేటెస్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్ మెంట్. వీటితో పనిచేయడానికి ఓ భారీ టీం పగలూ రాత్రి కష్టపడింది. ఈ సీన్ ల ప్రీ ప్రొడక్షన్ కే 100 రోజులు పట్టింది. హాలీవుడ్ స్టంట్ మాన్ కెన్నీ బేట్స్ దీనికోసం పనిచేశాడు. ఆయన డిజైన్ ఛేజ్ సీన్ లు చూస్తే అదిరిపోవాల్సిందే. ఈ షెడ్యూల్ కోసం వాతావరణం ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా టీం మొత్తం కంటిన్యూగా పనిచేస్తూనే వచ్చింది’’ అంటూ ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎంత కీలకమో చెప్పుకొచ్చాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగులో ఉందంటే దానికి సంబంధించిన విశేషాల కోసం ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు మాత్రమే ఆసక్తిగా చూసేవారు. బాహుబలి ఘన విజయంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాదు.. అభిమానులు కూడా తయారయ్యారు. అందుకే భారీ యాక్షన్ ఎంటర్ టెయినర్ ‘సాహో’ నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.