Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ మళ్లీ టైటిల్ తో కొట్టాడు

By:  Tupaki Desk   |   31 July 2015 9:54 AM GMT
ఆ డైరెక్టర్ మళ్లీ టైటిల్ తో కొట్టాడు
X
బాలీవుడ్ లో కొత్త ఒరవడి సృష్టించిన డైరెక్టర్లలో బాల్కి ఉరఫ్ బాలకృష్ణ ఒకరు. దక్షిణాది మూలాలున్న ఈ దర్శకుడి తొలి సినిమా చీనీ కమ్ (అంటే చక్కెర తక్కువ అని అర్థం, అదుర్స్ లో పంచ్ గుర్తుందిగా) అప్పటిదాకా బాలీవుడ్ నడుస్తున్న ఫార్ములా బాటను దాటి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పా’ కూడా భలే సినిమా అనిపించుకుంది. ఆపై ధనుష్, అమితాబ్ ప్రధాన పాత్రల్లో.. వారి పేర్లనే కలిపి ‘షమితాబ్’ అనే సినిమా తీసి మరోసారి సంచలనం రేపాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కాన్సెప్ట్ పరంగా బాలీవుడ్ ను ఆశ్చర్యపరిచింది.

బాల్కి కొత్త సినిమా విషయంలోనూ అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈసారి మరో చిత్రమైన టైటిల్ తో రాబోతున్నాడు. ఆ టైటిల్.. కీ అండ్ కా. ఇదేం టైటిల్ రా బాబూ అని జనాలు బుర్ర గోక్కుంటూ ఉంటే కొంచెం ఈ మధ్యే యూనిట్ వర్గాల నుంచి కొంచెం క్లారిటీ వచ్చింది. కీ అంటే లడకి, కా అంటే లడకా.. షార్ట్ కట్ లో కీ అండ్ కా అని టైటిల్ పెట్టారన్నమాట. ఈ సినిమాలో అర్జున్ కపూర్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే అర్జున్ తో పోలిస్తే కరీనా వయసులో పెద్ద. అర్జున్ రావడానికి పదేళ్ల ముందే అరంగేట్రం చేసింది. మరి వీళ్లిద్దరికీ జోడీ కుదిర్చాడంటే ఇదేదో మరో విభిన్నమైన సినిమా అయి ఉంటుందని తెలుస్తోంది. బాల్కి ఆస్థాన ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.