Begin typing your search above and press return to search.

ఆ కామాంధుడి బాగోతం ఆ దర్శకుడికి తెలుసట

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:13 AM GMT
ఆ కామాంధుడి బాగోతం ఆ దర్శకుడికి తెలుసట
X
హాలీవుడ్లో గత కొన్ని వారాలుగా సినిమా చర్చలు ఆగిపోయాయి. ప్రముఖ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ కామ లీలల గురించే అక్కడ చర్చలు సాగుతున్నాయి. తన బేనర్లో పని చేసిన హీరోయిన్లందరితోనూ అతను చాలా దారుణంగా ప్రవర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను బ్లాక్ మయిల్ చేసి చాలామంది హీరోయిన్లను లోబరుచుకున్న సంగతి వెల్లడైంది. ఏంజెలినా జోలీ లాంటి ప్రముఖ హీరోయిన్ కూడా అతడి బాధితురాలేనట. హార్వీ వికృత చేష్టలకు సంబంధించిన ఆడియోలు సైతం బయటికి వచ్చాయి. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా ఒక ఫేమస్ డైరెక్టర్ గళం విప్పాడు. అతనే.. క్వింటెన్ టొరంటినో.

రిజర్వాయర్ డాగ్స్.. పల్ప్ ఫిక్షన్.. కిల్ బిల్ లాంటి క్లాసిక్ సినిమాలు చేశాడు హార్వీతో టొరంటినో. ఐతే తాను హార్వీతో సినిమాలు చేస్తున్నపుడు అతను హీరోయిన్లను ఎలా వేధించేవాడో.. వాళ్లను ఎలా లొంగదీసుకునేవాడో తనకు తెలుసని అంగీకరించాడు టొరంటినో. ఐతే అప్పటికి అవన్నీ చిన్న విషయాలుగా తాను భావించానన్నాడు టొరంటినో. కానీ ఇప్పుడు అతడి గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆ విషయాలు అప్పుడు బయటపెట్టకుండా తప్పు చేశానేమో అనిపిస్తోందని అన్నాడు టొరంటినో. తనకు అతడిని అడ్డుకునే శక్తి ఉండి కూడా అడ్డుకోకపోవడం పట్ల టొరంటినో విచారం వ్యక్తం చేశాడు. హాలీవుడ్ నటి రోస్ మెక్ గువాన్ తో హార్వీకి జరిగిన సెటిల్మెట్ గురించి కూడా తనకు తెలుసని అన్నాడు టొరంటినో.