Begin typing your search above and press return to search.

క్వీన్ల ఎగ్జిబిషన్ బాగుందే!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 10:48 AM GMT
క్వీన్ల ఎగ్జిబిషన్ బాగుందే!!
X
ఒక భాషలో హిట్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో రీమేక్ కావడం సహజం. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఒకే సబ్జెక్ట్ ని నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్లతో ముగ్గురు దర్శకులతో తీయడం మాత్రం సాహసమనే చెప్పాలి. అలాంటి అరుదైన ప్రయత్నం క్వీన్ రీమేక్ తో జరుగుతోంది. నాలుగేళ్ళ క్రితం కంగనా రౌనాత్ టైటిల్ రోల్ పోషించిన క్వీన్ ఇప్పుడు తెలుగు-తమిళ-కన్నడ-మలయాళంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. వాటి తాలూకు పోస్టర్లు ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

తమిళ్ లో పారిస్ పారిస్ పేరుతో తీయగా కాజల్ అగర్వాల్ లుక్స్ కి ఇప్పటికే మంచి ప్రశంశలు దక్కాయి. కన్నడలో బటర్ఫ్లయ్ పేరుతో పరుల్ యాదవ్ తో మలయాళంలో మంజిమా మోహన్ తో జామ్ జామ్ పేరుతో రూపొందింది. కన్నడ-తమిళ వెర్షన్లకు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించగా మలయాళం వెర్షన్ కు మన నీలకంఠ బాధ్యతలు తీసుకున్నాడు. లుక్స్ పరంగా ఎక్కువ మార్కులు కాజల్ కొట్టేసినప్పటికీ విడివిడిగా చూసుకుంటే మాత్రం అందరు బాగానే ఉన్నారు.

కానీ తెలుగు వెర్షన్ తమన్నా లుక్ కొంచెం తేడాగా అనిపించడంతో సోషల్ మీడియాలో ట్రాలింగ్ మొదలైపోయింది. దటీజ్ మహాలక్ష్మి పేరుతో 100% లవ్ సినిమాలో హిట్ సాంగ్ ట్రాక్ ని టైటిల్ గా పెట్టిన ఈ మూవీలో మిల్కీ బ్యూటీని కాస్త డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలన్న థీమ్ తో కళ్ళజోడు పెట్టడం అంతగా నప్పలేదు. తీసింది ఒకే కథ అయినప్పుడు లుక్స్ కూడా ఒకటే విడుదల చేయాలి కదా. పోలిక వస్తుందని నిర్మాతలు ఆలోచించినా ఇలా చేస్తే మాత్రం రాకుండా ఉంటుందా.

పైగా మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగు వెర్షన్ పోస్టర్ లో దర్శకుడు పేరు లేరు. నీలకంఠ కొంత భాగం తీసాక బయటికి చెప్పని కారణాలతో తప్పుకున్నాడు. బాలన్స్ అ!! ఫేమ్ ప్రశాంత్ వర్మ పూర్తి చేసాడు. ఇది తన రెండో సినిమాగా ప్రచారం కాకూడదు అనే ఉద్దేశంతో పేరు ఉండకూడదు అనే కండిషన్ మీదే ప్రశాంత్ వర్మ ఇది పూర్తి చేసాడు. సో డైరెక్టర్ పేరు లేకుండానే దటీజ్ మహాలక్ష్మి విడుదల కాబోతోంది.