Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మరో బోల్డ్ ప్రేమ-

By:  Tupaki Desk   |   18 Sep 2018 8:33 AM GMT
ట్రైలర్ టాక్: మరో బోల్డ్ ప్రేమ-
X
నిన్న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్ యూత్ ని టార్గెట్ చేసినట్టుగా దానికి వస్తున్న స్పందనను బట్టే చెప్పొచ్చు. ఒక బుద్ధిమంతుడైన హీరో ఆధునిక అమ్మాయికి ప్రతిరూపంగా నిలిచే హీరోయిన్ సంప్రదాయంగా ఉండే హీరో తల్లి తండ్రులు వీళ్ళ మధ్య ఒక ఆసక్తికరమైన అంశంతో దర్శకుడు ఎలాన్ రూపొందించిన ఈ సినిమా కొంతకాలం క్రితమే తమిళ్ లో విడుదలై మంచి విజయం దక్కించుకుంది. కాస్త ఆలస్యంగా అయినా అదే పేరుతో తెలుగులో తీసుకొస్తున్నారు. యువాన్ శంకర్ రాజా అందించిన సంగీతం కోలీవుడ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక్కడ కూడా అదే ఫలితాన్ని ఆశిస్తున్నారు నిర్మాతలు. హరీష్ కళ్యాణ్ రైజా జంటగా నటించిన ఈ మూవీలో ఈ ఇద్దరు తప్ప ఇంకెవరిని పెద్దగా హై లైట్ చేసినట్టు కనిపించడం లేదు. హీరో పాత్రను అమాయకంగా తీర్చిదిద్దిన తీరు బాగుంది.

ఈ మధ్య హీరొయిన్ క్యారెక్టరైజేషన్ ను బోల్డ్ గా మలుస్తున్న దారిలోనే ఎలాన్ కూడా వెళ్ళాడు. దేనికి మొహమాట పడకుండా తనను ప్రేమించినవాడితో బెడ్ పంచుకోవడానికైనా నేరుగా ఫ***గ్ అంటూ తిట్టడానికైనా ఏ మాత్రం వెనుకాడని పాత్రలో రైజా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారేలా ఉంది. హీరో హరీష్ కళ్యాణ్ సింపుల్ గా బాగున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యువాన్ చాలా రోజుల తర్వాత మేజిక్ చేసినట్టు అనిపిస్తోంది. ఆధునిక ప్రేమలను చూపించిన ఈ ప్యార్ ఇష్క్ కాదల్ కు విజయ్ మొరవనేని-యువన్ శంకర్ రాజా సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ట్రెండీ ప్రేమ కథలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో ఈ ప్యార్ ప్రేమ కాదల్ యూత్ ని మెప్పిస్తే మటుకు మంచి వసూళ్లే రాబట్టుకోవచ్చు. త్వరలో విడుదల ప్లాన్ చేసిన ప్యార్ ఇష్క్ కాదల్ పూర్తి ఆడియో ఈ వారంలోనే విడుదల కానుంది.