Begin typing your search above and press return to search.

మహేష్ జనగణమన అసలు పాడతాడా!?

By:  Tupaki Desk   |   30 April 2016 5:30 PM GMT
మహేష్ జనగణమన అసలు పాడతాడా!?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి విడుదలై పదేళ్లు గడిచిన సందర్భంగా.. ఆన్ లైన్ లో ఫ్యాన్స్ హంగామా ఎక్కువగానే కనిపించింది. మహేష్ అంత ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాడో లేదో కానీ.. అభిమానులు మాత్రం తెగ ఊగిపోయారు. వారి ఆనందాన్ని తన ట్వీట్ కం పోస్టర్ తో రెట్టింపు చేసేశాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

త్వరలో మహేష్ బాబుతో మూవీ చేయనున్నానని చెప్పిన పూరీ.. జన గణ మన అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. అయితే.. అసలీ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కుతుందా అన్నదే అసలు డౌట్. ప్రస్తుతం బ్రహ్మోత్సవం ను రిలీజ్ కి రెడీ చేసిన మహేష్.. ఆ తర్వాత మురుగదాస్ తో సినిమాను స్టార్ట్ చేస్తాడు. తెలుగు - తమిళ్ బైలింగ్యువల్ గా ఈ చిత్రం తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్ లో పాగా వేసిన మహేష్.. తన మార్కెట్ ఇంకా పెంచుకునేలా ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాడు. పూరీతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమంటే.. మళ్లీ తెలుగు సినిమాని మాత్రమే చేయడమే.

పైగా మహేష్ తో మూవీ చేస్తున్నానని గతంలో కూడా పూరీ చెప్పాడు కానీ.. ఏదీ స్టార్ట్ అవలేదు. ప్రస్తుతం మహేష్ కు ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం.. పూరీతో సినిమాని ఒప్పుకున్నా అది రెండేళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈలోగా ఈ ప్రాజెక్టు మళ్లీ గాడి తప్పచ్చని అంటున్నారు. ఏదైనా కానీ., ఈ మూవీపై మహేష్ నుంచి ప్రకటన కానీ, ఏదన్నా ముహూర్తం పూజల్లాంటివి జరిగితేనే నమ్ముతాం అంటున్నారు అభిమానులు.