Begin typing your search above and press return to search.

నాని మహాలక్ష్మికి మాస్ డైరెక్టర్ విషెస్

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:30 AM GMT
నాని మహాలక్ష్మికి మాస్ డైరెక్టర్ విషెస్
X
పూరీ జగన్నాథ్ అంటే డైరెక్టర్లలో డైలాగ్ కింగ్ అనాల్సిందే. పది సీన్లలో చెప్పాల్సిన విషయాన్ని ఒకే డైలాగ్ తో చెప్పించగల ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్ అని.. తోటి దర్శకులు కూడా పొగుడుతూ ఉంటారు. మరి అలాంటి దర్శకుడి నుంచి ఒక మాట వచ్చిందంటే.. అది హాట్ టాపిక్ కాకుండా ఎలా ఉంటుంది?

'హాయ్ మెహ్రీన్.. నీ మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ రిలీజ్ సందర్భంగా ఆల్ ది బెస్ట్' ఇదీ పూరీ చేసిన ట్వీట్. తెల్లారి పొద్దున రిలీజ్ అనగా విషెస్ చెప్పడం వింత కాదు కానీ.. పూరీ ఏం చేసినా వెనక ఓ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. కేవలం విషెస్ చెప్పడానికే అయితే.. హీరోయిన్ మెహ్రీన్ పీర్జాడా కౌర్ తో పాటు.. హీరో నాని, డైరెక్టర్ హను, ఇంకా సినిమాకి కూడా గ్యారెంటీగా విషెస్ చెప్పేవాడు. కానీ ఇక్కడ పూరీ కేవలం హీరోయిన్ కి ఒక్కదానికే ఆల్ ది బెస్ట్ అంటున్నాడని గుర్తుంచుకోవాలి.

పూరీ సినిమాల్లో ఎక్కువగా కొత్త హీరోయిన్స్ కనపడుతూ ఉంటారు. ఈ డైరెక్టర్ కూడా కొత్తోళ్లని, ఒకటి అరా సినిమాలు చేసినవాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తాడు. పూరీ సినిమాల్లో హీరోయిన్స్ కి మాంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్త అమ్మాయిలని వెతికే పూరీకి.. మెహ్రీన్ బాగా నచ్చుంటుందని.. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో ఆఫర్ ఇవ్వనున్నాడనే టాక్ అప్పుడే మొదలైపోయింది.