Begin typing your search above and press return to search.

సినిమాలో కనిపించేది వాళ్లేగా పూరీ

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:17 AM GMT
సినిమాలో కనిపించేది వాళ్లేగా పూరీ
X
దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాడు. కళ్యాణ్ రామ్ తో తీసిన ఇజం మూవీకి టాక్ బాగోలేకపోయినా కలెక్షన్స్ మాత్రం బాగుండడం.. పూరీ సంతోషానికి మెయిన్ రీజన్. అందుకే కలెక్షన్స్ డ్రాప్ అవకుండా ఉండేందుకు శాయశక్తులా ట్రై చేస్తున్నాడు. ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ.. ఇజం ప్రమోషన్స్ లో తనే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు కూడా.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా పూరీ చెప్పిన ఓ టార్గెట్ ఏంటంటే.. ఎప్పటికైనా ఓ ఇంగ్లీష్ సినిమా తీసేయాలని ఉందట. అంటే ఆ సినిమాలో ఇండియన్స్ తో పాటు ఫారిన్ యాక్టర్స్ కూడా ఉండగా.. ఎవరి భాషలో వారు నటించేస్తారన్న మాట. ఇదే మూవీ రీజనల్ వెర్షన్స్ కూడా ఉంటాయట. లక్ష్యం బాగానే ఉంది కానీ.. పూరీ ఎప్పుడైతే బ్యాంకాక్ లో సినిమాలు చుట్టేయడం మొదలుపెట్టాడో.. అప్పటి నుంచి ఫైటర్లు.. డ్యాన్సర్లు. - కొన్ని సైడ్ కేరక్టర్లు కూడా అక్కడివే ఉంటున్నాయి.

ఇంతలేసి మంది ఫారిన్ భామలను పెట్టి సినిమాలు తీస్తున్నా పూరీకి సంతృప్తి కలగడం లేదన్న మాట. వాళ్లకు లీడ్ కేరక్టర్స్ ఇచ్చేసి మూవీ తీస్తే కానీ.. పూరీ కోరిక తీరదు. ఏ విషయాన్నైనా పీక్స్ కి తీసుకెళ్లడం అంటే ఇదే కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/