Begin typing your search above and press return to search.

సార్.. ఇప్పటికీ అదే మా ఇల్లు -పూరి జగన్

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:36 PM GMT
సార్.. ఇప్పటికీ అదే మా ఇల్లు -పూరి జగన్
X
టాలీవుడ్ లో శివ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు నాగార్జున కి ఏ స్థాయిలో ఫ్యాన్స్ అయ్యారో ఆ చిత్రాన్ని తెరకెక్కించిన వర్మకి కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ అయ్యారు. అంతే కాకుండా ఆయన ప్రేరణతో ఎంతో మంది యువ దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పటికే కొంత మంది టాప్ దర్శకులు ఆయన సినిమాలు చాలా ఇష్టమని చెబుతుంటారు. అయితే వర్మ స్టార్ హీరోలతో సినిమాలను తీసి చాలా కాలమే అవుతోంది. ఇక రీసెంట్ గా ఒక కొత్త తరహా కథను అక్కినేని నాగార్జునకి వినిపించి సినిమాను ఫైనల్ గా సెట్స్ పైకి తెచ్చాడు. ఇక ఈ సినిమాతో మళ్లీ తన గత వైభవాన్ని చూపించాలని వర్మ చూస్తున్నాడు.

రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ పై రీసెంట్ గా నాగార్జున ఒక ట్వీట్ చేశాడు. 28 ఏళ్ల క్రితం శివ సినిమా నా లైఫ్ ని చేంజ్ చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో సినిమా చేస్తున్నా అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే నాగ్ ట్వీట్ ని వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. తను కూడా ఒక స్వీట్ ట్వీట్ చేశాడు.

''సార్.. శివ చిత్రం మా జీవితాలను కూడా మార్చేసింది. నాగ్ అండ్ అర్జీవి కలిసి మరోసారి సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కాంబినేషన్‌ లో మరోక బ్లాక్‌ బ్లస్టర్ రానుంది. ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోని మేము ఒక ఇంటిలా భావిస్తాం. రెస్పెక్ట్ అండ్ లవ్'' అంటూ పూరి తనదైన శైలిలో చెప్పాడు. మొన్న రాము కూడా సేమ్ ఇదే తరహా మాటన్నాడు. మొత్తానికి ఆ సినిమా ఓపెనింగ్ టైము లో పంజాబ్ లో మెహబూబా సినిమా షూటింగులో ఉన్న పూరి.. ఆ ఈవెంటును చాలా మిస్సయినట్లు మనం ఈ ట్వీట్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు.